Top
logo

సహో పోలీస్ బహుబలి

సహో పోలీస్ బహుబలి
X
Highlights

ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సరైనసమయానికి ఆస్పత్రికి చేర్చి, క్షేమంగా రక్షించి...

ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సరైనసమయానికి ఆస్పత్రికి చేర్చి, క్షేమంగా రక్షించి శభాష్‌ అనిపించుకున్నారు పోలీసులు.. మెదక్‌ జిల్లా, మేడికొండ తాండా కు చెందిన వినోద్‌కుమార్‌ దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిసరాల్లో ఉంటూ ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. తాగుడికి బానిసైన వినోద్‌కుమార్‌ శుక్రవారం భార్యతో గొడవ పడి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దీంతో అతని భార్య స్థానికులను అప్రమత్తం చేయడంతో వినోద్‌కుమార్‌ను కిందకు దింపాగా,అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి చేరుకోగా, స్థానికులు దుండిగల్‌ పెట్రోలింగ్‌ వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటయ్యగౌడ్, డ్రైవర్‌ కృష్ణారెడ్డి అతడిని పై అంతస్తు నుంచి భుజాలపై కిందకు తీసుకు వచ్చి, ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వినోద్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సకాలంలో స్పందించి బాధితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులకు స్థానికులు సలాంచేశారు.

Next Story