సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం
x
Highlights

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని గుంటూరు అర్బన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.....

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని గుంటూరు అర్బన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. క్ష్మీపురంలోని బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. ఇక్కడ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలు, నిర్వాహకుడు రామచంద్రరావుతోపాటు అతని అసిస్టెంట్‌, ఒక విటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18వేల రూపాయల నగదుతోపాటు, 11సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్‌ను నాలుగేళ్ల నుంచి రామచంద్రరావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను బ్యూటీ పార్లర్‌లో వర్కర్లుగా పనిచేయిస్తున్నాడు. అయితే నష్టాలు రావడంతో నిర్వాహకుడు రామచంద్రరావు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. మహిళలతో పురుషులకు మసాజ్ చేయించడమే కాకుండా వ్యభిచారం కూడా చేయిస్తున్నాడు. అర్బన్ ఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు మసాజ్ సెంటర్‌పై నిఘా పెట్టిన పోలీసులు దాడులు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories