మీడియా ముందుకు నిందితుడు కార్తీక్‌...

మీడియా ముందుకు నిందితుడు కార్తీక్‌...
x
Highlights

సంధ్యారాణి హంతకుడు కార్తీక్‌ను విచారించిన పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. కార్తీక్ ఒక్కడే నేరం చేశాడనీ సంధ్యను వెంటాడి దాడి చేశాడని డీసీపీ...

సంధ్యారాణి హంతకుడు కార్తీక్‌ను విచారించిన పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. కార్తీక్ ఒక్కడే నేరం చేశాడనీ సంధ్యను వెంటాడి దాడి చేశాడని డీసీపీ సుమతి వివరించారు. ప్రేమను తిరస్కరించడం వల్లే కక్ష పంచుకుని పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెప్పారు. కార్తీక్‌పై 307, 354, 354d సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా పెట్టామని సుమతి చెప్పారు. సంధ్య హత్య కేసులో అన్ని ఆధారాలు సేకరించామనీ దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని అన్నారు.

సంధ్యారాణితో కార్తీక్‌కు రెండేళ్ళుగా పరిచయం ఉందన్న డీసీపీ సుమతి ఇద్దరూ కలసి లక్కీ ట్రేడర్స్‌లో పని చేశారని చెప్పారు. అదే సమయంలో కార్తీక్ ప్రేమ ప్రతిపాదన పెట్టగా సంధ్య తిరస్కరించిదని తెలిపారు. కార్తీక్ వెంటపడుతున్నాడని సంధ్య ఓసారి షాపు ఓనర్‌కు చెప్పిందని దీంతో ఆయన కార్తీక్‌ను బెదిరించాడని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories