అవును. వాళ్లిద్దరూ పోలీసులు. ఖాకీ చొక్కా ధరించి, చేతిలా లాఠీపట్టి, సమాజంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే రక్షకభటులు. దారితప్పినవాళ్లను తమదైన...
అవును. వాళ్లిద్దరూ పోలీసులు. ఖాకీ చొక్కా ధరించి, చేతిలా లాఠీపట్టి, సమాజంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే రక్షకభటులు. దారితప్పినవాళ్లను తమదైన స్టైల్‌లో దారికి తెచ్చే ఖాకీలు. కానీ వాళ్లిద్దరూ దారి తప్పారు. నీతి తప్పారు. నైతికత తప్పారు. పక్కచూపులకు లొంగిపోయి, కుటుంబ జీవితాలను బజారుకీడ్చుకున్నారు. పోలీసు శాఖ పరువు తీశారు. ఖాకీ చొక్కాకున్న విలువతకు పాతరేశారు. ఔను. వాళ్లిద్దరూ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లిఖార్జున్ రెడ్డి. మీడియా సాక్షిగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇంతకీ వీరి పరిచయ, ఎక్కడ ఎలా మొదలైంది...ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతోంది...సమాజాన్ని దారిలోపెట్టాల్సిన వీళ్లే, దారి తప్పి సభ్యసమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు.
దొంగ ఎప్పటికైనా దొరికిపోతాడు. తప్పు చేసినవారూ అంతే. ఏదో ఒక దొరక్కపోక తప్పదు. చరిత్ర చెబుతున్న నిజమిదే. ఈ విషయం పోలసులకైతే బాగా తెలుసు. ఎందుకంటే, అలాంటి దొంగలను, అక్రమ సంబంధాల నిగ్గు తేల్చే విక్రమార్కులు వారే కాబట్టి. అందుకే ఇప్పుడు సమాజంలో చూపులన్నీ వారివైపు చూపిస్తున్నాయి. నీతులు చెప్పే మీరు గోతులు తియ్యడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఒకరిద్దరు చేసిన పాపానికి, పోలీసు శాఖకు తలవంపులు వస్తున్నాయని, సిన్సియర్ పోలీసు అధికారులు మధనపడుతున్నారు. ఇంతకీ సునీత, మల్లిఖార్జున్ ఇల్లీగల్ ఎఫైర్ స్టోరీ ఏంటి?
ప్రపంచం నిద్రపోయినా మేల్కొని ఉండి, భద్రతనిచ్చే రక్షకభటుడు. పోలీస్ అంటే జీవితాన్ని సమాజానికి అంకితం చేయడమే. వ్యక్తిగత జీవితం, కుటుంబం, పండుగలు, పబ్బాలు, సెలవులు, ఎంజాయ్ అన్నదే మర్చి, 24 గంటలు డ్యూటీలో ఉండే ఏకైక సమాజ సైనికడు పోలీసు. ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వీరుడు. అందుకే పోలీస్ అంటే అందరికీ భయంతో కూడిన గౌరవం. సలాం చేయాలనిపించే మర్యాద. మరి పోలీసు పట్ల ఇప్పటికీ అలాంటి అభిప్రాయం ఉందా?
పోలీసు వ్యవస్థకు మచ్చతెస్తున్న కొన్ని ఘటనలు
అవును. కొన్ని పరిణామాలు, కొందరి పోలీసుల ప్రవర్తన చూస్తుంటే, ఇలాగే అనిపిస్తుంది. డిపార్ట్‌మెంట్‌కే వన్నెతెచ్చిన ఎందరో పోలీసులున్నారు. సమాజంలో శాంతిభద్రతలకు నెలకొల్పడంలో ప్రాణాలు అర్పించినవారున్నారు. కానీ ఈమధ్య జరుగుతున్న కొన్ని ఘటనలు పోలీసు వ్యవస్థకు మచ్చతెస్తున్నాయి. ఖాకీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఇందులో తాజా ఉదంతం, అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి వివాహేతర సంబంధం.
జీవితాలను రచ్చ చేసుకున్న సునీత, మల్లిఖార్జున్
పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సునీతారెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డిలు, పక్కచూపులకు లొంగిపోయి, ఇరువురి జీవితాలను రచ్చ చేసుకున్నారు. కుటంబాలను క్షోభకు గురి చేశారు. డిపార్ట్‌మెంట్‌లో సస్పెన్షన్‌కు గురికావడమే కాదు, పరువూ పొగొట్టుకున్నాకు. నీతికి, న్యాయానికి, ధర్మానికి, నైతికతకు పట్టంకట్టి, సమాజంలో పరివర్తన తేవాల్సిన పోలీసులు, ఇలా అడ్డదారులు తొక్కి, జీవితాలను బజారుపాలు చేసుకున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి, చెప్పు దెబ్బలూ తిన్నారు.
అసలు సునీతారెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి నేపథ్యమేంటి
యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీలో అడిషినల్ ఎస్పీ సునీతారెడ్డి. 2007లో గ్రూప్ వన్‌లో మంచి మార్కులు తెచ్చుకుని, పోలీసు శాఖలో ప్రవేశించారు. 2010లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేందర్ రెడ్డితో వివాహమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఇందూ ఫార్య్యూన్ ఫీల్డ్స్ గార్డెనియా గేటెడ్ కమ్యూనిటిలో ఉంటున్నారు. అయితే తన భార్య ఫోన్ వాట్సాప్ మెసెజ్‌లు భర్త సురేందర్ రెడ్డిలో అనుమానాలు రేకెత్తించాయి.
సునీత, సురేందర్ చీకటి బంధంతో కాపురంలో కలహాలు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సీఐ....మల్లిఖార్జున్ రెడ్డి. గతంలోనే వీరిద్దరికీ పరిచయం ఉంది. అప్పటి నుంచే సునీత, సురేందర్ రెడ్డి మధ్య కలహాలు పెరిగాయి. వీరి ఇల్లీగల్ ఎఫైర్‌ను 2016 జూలైలోనే భర్త సురేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు కనిపెట్టారు కూడా. స్పాట్‌లోనే వారిని ప్రశ్నించారు. తమ మధ్య ఎలాంటి సంబంధాల్లేవని నమ్మించారు. ఎందుకు అనుమానిస్తున్నారని, సీరియస్ అయ్యారు కూడా.
వీరి బుకాయింపులు అర్థంకావడంతో భర్త సురేందర్ రెడ్డితో పాటు కుటుంబసభ్యులు గట్టిగా నిలదీశారు. మరోమారు ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి ఇరువురూ క్షమాపణ చెప్పారు. ఇకపై ఎలాంటి సంబంధాలను కలిగి ఉండనని చెప్పడంతో భార్య మాటలను నమ్మిన సురేందర్‌రెడ్డి కాపురం సాగించాడు.
వివాహం చేసుకుందామని వాట్సాప్ సంభాషణ
పెద్దల సమక్షంలో బుద్ది చెప్పినా మారలేదు వీరిద్దరూ. అందుకు సాక్ష్యం, ఇరువురి వాట్సాప్ సంభాషణలే. కొన్ని రోజుల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి నుంచి సునీత ఫోన్‌కు మెసేజ్‌లు పెరిగాయి. మల్లికార్జున్‌రెడ్డి ఏఎస్పీ సెల్‌కు పంపిన మెసేజ్‌లో వివాహం చేసుకుందామని ప్రతిపాదించడం చూసిన ఆయన, ఇరువురు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని నిర్ధారణకు వచ్చాడు. ఈ క్రమంలో మల్లికార్జున్‌రెడ్డి తనను చంపేస్తానని బెదిరించడంతో మనోవేదనకు గురయ్యాడు. కానీ వీరి కథ ఎలాగైలా తేల్చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈసారి చాలా పకడ్బందీ ప్లాన్ వేశాడు భర్త సురేందర్ రెడ్డి. సాధారంగా సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో విదేశాలకు వెళుతుంటాడు సురేందర్. అదేపని మీద లండన్ వెళ్లాడు. కానీ సిటీకి రెండు రోజుల ముందే వచ్చినట్టుగా భార్య సునీతకు చెప్పలేదు. సోమవారం రోజు, రాత్రి కల్వకుర్తి నుంచి నగరానికి వచ్చాడు మల్లిఖార్జున్ రెడ్డి. అయితే ఉప్పల్‌లోని తన ఇంటికి కాకుండా, కేపీహెచ్‌బీలోని సునీత ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు.
రాత్రి 2 గంటలకు ఫ్లాట్‌లోంచి బయటకు వస్తుండగా దొరికారు. మరోవైపు ఇలాంటి టైం కోసమే ఎదురుచూస్తున్న సురేందర్, తన అమ్మ, అత్తతో కలిసి అపార్ట్‌మెంట్ దగ్గర కాపుకాశాడు. రాత్రి రెండు గంటలకు సీఐ తన ఫ్లాట్‌లో నుంచి బయటికి వస్తుండగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు సురేందర్. అందర్ని తోసేస్తూ, బయటికి పారిపోయే ప్రయత్నం చేశాడు మల్లిఖార్జున్. సునీత అసలు బెడ్ రూంలోంచి బయటకు రాకకుండా, లోపలే దాక్కుంది. బయటకు వెళ్లకుండా మల్లిఖార్జున్‌ను అమ్మ, అత్త, వారించడంతో, మళ్లీ దాడికి దిగాడు. ఆ రాత్రంతా, అపార్ట్‌మెంట్‌లో రచ్చరచ్చ అయ్యింది.
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారాలతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు
మల్లిఖార్జున్ రెడ్డి, అర్థరాత్రి తన ఇంటికి వచ్చి, కొంతసేపటి తర్వాత వెళ్లిపోయాడని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారాలతో సహా కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సురేందర్. అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు మల్లిఖార్జున్‌పై ఐపీసీ 448, 497, 506 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. విచారణ ముమ్మరం చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు, దీనిలో భాగంగా ఏఎస్పీ భర్త సురేందర్‌రెడ్డి, తల్లి ప్రమీలమ్మ, పెద్దమ్మ సునంద, సురేందర్‌రెడ్డి స్నేహితుడు సురేష్ కుమార్‌లను విచారించి అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజిలు, ఇరువురి ఫోన్ కాల్ డేటాను సేకరించారు. శాఖాపరంగా ప్రాథమిక విచారణలోనూ, వీరి సంబంధంపై బలమైన ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. దీంతో సీఐ మల్లికార్జున్ రెడ్డిని వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేయగా, ఏఎస్పీ సునీతారెడ్డిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
ప్రతి బంధానికి ఒక పలకరింపు ఉంటుంది. అది పరిచయంగా...2016లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు గుర్తుందా...మరి ఈ కేసుతో వీరికి లింకేంటనేగా సందేహం...
ఓటుకు నోటు కేసు విచారణ ఇద్దర్నీ కలిపింది
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసే ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున్‌రెడ్డిలను దగ్గర చేసినట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా వీళ్లిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. వ్యక్తిగత విషయాలు పంచుకునేవరకూ వెళ్లిన వీళ్లిద్దరి పరిచయం, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది.
భర్తతో ఉండలేనని చెప్పిన సునీత
అయితే ఏఎస్పీ సునీత తన భర్తతో కలిసి ఉండలేనని చెప్పినట్లు తెలుస్తోంది. సీఐ మల్లికార్జున్‌రెడ్డి కూడా తన భార్యతో సఖ్యంగా లేనని ఇద్దరం పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే విషయం ఉన్నతాధికారుల దృష్టి వరకూ వెళ్లడంతో ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డిని ఏసీబీ నుంచి బదిలీ చేశారు. అయినా తరచూ కలుస్తుండటంతో అడ్డంగా దొరికిపోయారు.
సునీత, మల్లిఖార్జున్‌లే కాదు,
పోలీసు శాఖలో ఈమధ్య కొందరు దారితప్పిన పోలీసుల ఉదంతాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆ జాబితాలో సంచలనం సృష్టించిన ఒక కేసు గుంటూరు జిల్లాకు రజియా సుల్తానా, ఎస్‌ఐ రంగనాథ్‌ల వ్యవహారం. పొన్నూరు ఎస్‌ఐగా పని చేసిన రంగనాథ్‌గౌడ్ తనని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు రజియా సుల్తానా ఆరోపించి, న్యాయం చేయాలని దీక్ష చేశారు. కాకినాడలో రాజేశ్వర రావు అనే ఓ హెడ్ కానిస్టేబుల్ ఇలాగే, పక్కచూపులు చూసి పరువుపోగొట్టుకున్నాడు. స్వయంగా భార్యే, ఇతని బండారాన్ని బయటపెట్టింది. ఇక ఖమ్మం టూటౌన్ ఎస్‌ఐగా పని చేసిన విజయ్, చాటుమాటు వ్యవహారం కూడా గతేడాది రచ్చరచ్చయ్యింది. హైదరాబాద్ మోతి నగర్‌లో ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్న విజయ్‌ను, భార్యే పట్టించింది.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది మరో పోలీసు రాసలీల. 2014లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల విధులకోసం వచ్చాడు నాటి కరీంనగర్ జిల్లాలో సీఐగా పని చేసిన స్వామి. లక్డీకపూల్‌లో తనకు కేటాంయిన ద్వారకా హోటల్‌లో కాకుండా, బృందావన్ హోటల్‌కు చాటుమాటుగా వెళ్లాడు. అక్కడ వరంగల్ జిల్లాకు చెందిన మహిళా ఎస్‌ఐ ఉన్నారు. వీరి అక్రమ సంబంధంపై నిఘా వేసిన మహిళా ఎస్‌ఐ భర్త, రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. పరుగులు పెట్టిన సీఐ స్వామి దృశ్యాలు సీసీ కెమరాలో చిక్కాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే, ఎందరో దారితప్పిన ఖాకీలు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలను సరైన మార్గంలో నడిపించాల్సిన పోలీసులే వక్రమార్గం పట్టి, పోలీసు శాఖ ప్రతిష్టను మసకబారుస్తున్నారు. హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకూ ఎందరో ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్‌తో డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు. కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు మార్గం తప్పుతున్నారు.
ఇప్పుడు ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లిఖార్జున్ రెడ్డి వివాహేతర సంబంధం కూడా మొత్తం పోలీస్ వ్యవస్థకే తలవొంపులు తెస్తోంది. సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ప్రజలను సరైన దారిలో నడిపించాల్సిన పోలీసులే దారి తప్పడం చర్చనీయాంశమవుతోంది. మరి ఇప్పటికైనా శాఖలో పోలీసుల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు నిఘాపెట్టి, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎంతోపేరున్న పోలీసు శాఖకు చెడ్డపేరు తెచ్చే ఎవర్నీ వదలకూడదని, సామాన్య జనం పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారో, వీరి పట్లా అంతే కఠినంగా వ్యవహరించాలంటున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire