అసలే పోలీస్..ఆపై మందేశాడు

x
Highlights

ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అనేది ఓ నానుడి. ఇది పోలీసోళ్ళకి బాగా వర్తిస్తుంది. మద్యం తాగి వాహనాలు నడొపొద్దని చెప్పే పోలీసులు... తమ దగ్గరికి వచ్చే...

ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అనేది ఓ నానుడి. ఇది పోలీసోళ్ళకి బాగా వర్తిస్తుంది. మద్యం తాగి వాహనాలు నడొపొద్దని చెప్పే పోలీసులు... తమ దగ్గరికి వచ్చే సరికి ఆ రూల్‌ను పక్కన పెట్టేస్తున్నారు. కొందరు పీకలదాకా తాగి వీరంగం వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ మందు తాగిన పోలీస్ అధికారి సృష్టించిన బీభత్సమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

ఇది పీకలదాకా తాగి ఓ పోలీసు అధికారి సృష్టించిన బీభత్సం.. ఓ పోలీసాయన మద్యం మత్తులో చేసిన ప్రమాదం.. బాధ్యత గల పోలీసు అధికారి పీకలదాకా తాగి నానా యాగీ చేశాడు. మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో మరచి రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. ఫలితం ఇద్దరి కాళ్ళు విరిగాయి. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అంబర్ పేట్ ట్రైనింగ్ సెంటర్ సీఐ గిరిష్ రావ్ మద్యం మత్తులో కారు నడపడమే కాకుండా.. విచక్షణా రహితంగా ఇతర వాహనాల మీదకు దూసుకెళ్లాడు. గిరిష్ రావ్ మద్యం మత్తులో కారు నడిపి ముందు వెళ‌ున్న ఓఆటోను, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోండా యాక్టివాపై వెళ్తున్న దంపతుల కాళ్ళు విరిగాయి. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే జవహర్‌ నగర్ పోలీసులు గిరీష్ రావుకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. ఇందులో నమోదైన పాయింట్లు చూసి సాటి ఖాకీలే అవాక్కయ్యారు. బ్రీత్ ఎనలైజర్‌లో 239 పాయింట్లు నమోదవ్వడమే ఇందుకు కారణం. సాక్షాత్తూ ఓ సీఐ మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణం కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. సీఐపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వెంటనే గిరిష్ రావుకు నోటీసులిచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ హడావిడి చేసి దొరికిన అందరిపై కేసులు పెడుతున్న పోలీసులు గిరిష్ రావు వ్యవహారంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories