నేడు పోలీస్ అమర వీరుల దినోత్సవం

nanireddy
Updated on: 24 Dec 2018 3:33 PM IST
నేడు పోలీస్ అమర వీరుల దినోత్సవం
X

రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసు సంస్మరణ కార్యక్రమంలో డీజీపీ పాల్గొని ప్రసంగించారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా 414 మంది పోలీసులు అమరవీరులయ్యారని తెలిపారు. రాష్ట్రంలో ఆక్టోపస్ కానిస్టేబుల్ ఆర్.లక్‌పతి విధి నిర్వహణలో చనిపోయారని గుర్తుచేశారు. శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు ప్రాణత్యాగాలకు వెనుకాడరని... ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు పోలీసులు విశేష కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కూడా పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.

nanireddy

nanireddy

Next Story