పోలవరం గ్యాలరీ వాక్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

పోలవరం గ్యాలరీ వాక్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
x
Highlights

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పోలవరం గ్యాలరీ వాక్ ప్రారంభమైంది. స్పిల్ వే దగ్గర పైలాన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పోలవరం గ్యాలరీ వాక్ ప్రారంభమైంది. స్పిల్ వే దగ్గర పైలాన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాలరీ వాక్ లో పాల్గొన్నారు. డ్యాం నీటి ఊటను తిరిగి పంపుల ద్వారా రిజర్వాయర్ లోకి నీటిని పంపేందుకు గ్యాలరీ నిర్మించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ సందర్శనకు శాసన సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లారు. సీఎం చంద్రబాబు స్పిల్ వే దగ్గరు పైలాన్ ఆవిష్కరించారు.

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కుటుంబ సమేతంగా రావడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద సందడి వాతావరణం నెలకొంది. గ్యాలరీ వ్యాక్ ను ప్రారంభించన సీఎం చంద్రబాబు పోటో గ్యాలరీని తిలకించారు. పోలవం ప్రాజెక్టు నిర్వహణ, భద్రత పరిశీలనలో గ్యాలరీయే కీలకం. స్పీల్ వే మొత్తం పొడవు పదకొండు వందల 18 మీటర్లు. కీలకమైన ఈ స్పిల్ వే అండర్ గ్రౌండ్ లోనే గ్యాలరీని నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories