ఒక తల తీసి మరొకరి మొండానికి అతికించి రికార్డు..!
సెర్గి అనే డాక్టర్ కిందటేడాది ఒక వ్యక్తి తలను ఇంకో వ్యక్తి మొండేనికి అతికిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే అది అసాధ్యమని అందరు అప్పట్లో అన్నారు కూడా.. తాజాగా సెర్గి ఇంకో రికార్డు సృష్టించారు. ఒకరి తలను ఇంకొకరికి అమర్చడం సాధ్యమేనని నిరూపించేందుకు ఆయన బృందంలోని డాక్టర్ ఒకరు చైనాలో ఒక శవంపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. డాక్టర్ షియావ్‌పింగ్ రెన్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగిందని.. వెన్నెముకతోపాటు నాడులు, రక్తనాళాలు అన్నింటినీ ఇంకో మొండేనికి అతికించగలిగామని కానవేరో వెల్లడించారు.
అంతేకాదు ‘పుట్టు.. పెరుగు.. చావు అంటూ ఇంతకాలం మనమెలా బతకాలో ప్రకృతి నేర్పించింది. మనిషి పరిణమించే క్రమంలో కోట్ల మంది చనిపోయారు. ఇది భారీ స్థాయిలో జరిగిన మారణకాండ అని నేనంటాను. అయితే ఇకపై ఇలా జరగదు. మన భవిష్యత్తు ఏదో మనమే నిర్ణయించుకునే సమయం వచ్చేసింది’ అని కానవేరో ప్రకటించారు. తలల మార్పిడి ప్రక్రియ విజయవంతమైతే ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. ఇటీవల చైనాలో దాదాపు 18 గంటలపాటు శస్త్ర చికిత్స జరిపి ఒక శవం తలను ఇంకో మొండేనికి మళ్లీ అతికించగలిగామని ప్రకటించారు...



