ఇవాళ్టి నుంచి తిరుపతిలో ప్లాస్టిక్ నిషేధం...నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానాలు

x
Highlights

తిరుపతిలో ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ విషయంపై నగరంలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం...

తిరుపతిలో ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ విషయంపై నగరంలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలు కోసం నగరపాలక సంస్థ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ వాడితే ఫైన్లు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్ ను తిరుపతిలో నిషేధించాలని నగరపాలక సంస్థ తీర్మానించింది. గాంధీ జయంతి రోజైనా అక్టోబర్ రెండు నుంచి తిరుపతిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వస్తుంది. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ వినియోగించేవారిపై భారీ జరిమానాలు వేయనున్నారు.

చిత్తూరు జిల్లాలో ఏటా వంద టన్నుల ప్లాస్టిక్‌ విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీ వారు సేకరించే చెత్తలో ఐదు శాతానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉంటున్నాయి. ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న ముప్పును గుర్తించాలని జిల్లా అధికార యంత్రాంగం కొద్దిరోజులుగా విస్త్రత ప్రచారం నిర్వహిస్తోంది. గాంధీ జయంతి నుంచి తిరుపతిలో నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

తిరుపతిలో ప్లాస్టిక్ వస్తువుల నిషేధం కోసం ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, వర్తక సంఘాల, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. ఇందుకు ఆయా సంఘాలు మద్దతు పలికాయి. ఇందుకు తమ వంతు చేయూతనిస్తామని హామీ ఇచ్చాయి. తిరుపతిని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో భాగంగా ప్రజలను చైతన్య పరచడం కోసం నగర వీధుల్లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ తరిమికొడదాం అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ భూతాన్ని దహనం చేశారు.
ఇప్పటికే స్వచ్చ సర్వేక్షణ, స్వచ్చ భారత్ లో దేశంలోనే ప్రముఖ స్థానాన్ని కైవసం చేసుకుని అందరీ దృష్టినీ ఆకర్షించిన తిరుపతి ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధించి దేశంలో ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories