కుప్ప కూలిన ఆర్మీ శిక్షణ విమానం

nanireddy
Updated on: 24 Dec 2018 4:18 PM IST
కుప్ప కూలిన ఆర్మీ శిక్షణ విమానం
X

ఆర్మీ శిక్షణ విమానం కుప్ప కూలింది. ఈ ఘటన యాదగిరి గుట్ట మండలంలో జరిగింది. విమాన ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన పైలెట్ పారాచూట్ సహాయంతో కిందకు దూకి ప్రాణాలు దక్కింఎంచుకున్నాడు. ఆ తరువాత క్షణాల్లో విమానం కాలి బూడిద అయింది. కాగా అందులోని పైలెట్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్‌గా గుర్తించారు.

విమానం క్రాష్ గురించి తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని ఫైలెట్ కు వైద్య సహాయం అందించారు.పైలెట్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆలేరు సాయిబాబా గుడి దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ వెంచర్ లో ఈ ట్రైనింగ్ విమానం కూలినట్లుగా తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story