ప‌రిశీల‌న‌లో వైజాగ్ రైల్వేజోన్ : పీయూష్‌ గోయల్‌

ప‌రిశీల‌న‌లో వైజాగ్ రైల్వేజోన్ : పీయూష్‌ గోయల్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రైల్వే జోన్‌ డిమాండ్‌పై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ఏపీ ఎంపీల ఆందోళనలపై స్పందించిన పీయూష్‌ ఏపీకి రైల్వే జోన్‌ కేటాయింపు...

ఆంధ్రప్రదేశ్‌ రైల్వే జోన్‌ డిమాండ్‌పై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ఏపీ ఎంపీల ఆందోళనలపై స్పందించిన పీయూష్‌ ఏపీకి రైల్వే జోన్‌ కేటాయింపు పరిశీలనలో ఉందన్నారు. అయితే రైల్వే జోన్‌ విషయంలో సరిహద్దు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉందన్నారు. రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని మాత్రమే చట్టంలో ఉందని, కాంగ్రెస్ సరిగా చేసి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. అదే విధంగా టీడీపీ ఎంపీలు లోక్‌సభలో కూడా ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories