ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి చుక్కెదురు

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి చుక్కెదురు
x
Highlights

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీరుపై జన్మభూమి కార్యక్రమాల వేదికగా ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. బుధవారం పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో...

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీరుపై జన్మభూమి కార్యక్రమాల వేదికగా ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. బుధవారం పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో నిర్వహించాల్సిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఈశ్వరి బృందాన్ని పంచాయతీ గిరిజనులు అడ్డగించారు. పాడేరు–చోడవరం ప్రధాన రహదారిలోని కందమామిడి కూడలి నుంచి బంగారుమెట్ట వరకు పదిహేనేళ్ల క్రితం వేసిన తారురోడ్డు పూర్తిగా పాడైపోయిందని, ఈ విషయంపై గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ఐదవ విడత జన్మభూమిని తాము బహిష్కరిస్తున్నామని పంచాయతీ సర్పంచ్‌ పాంగి నాగరాజు ముందుగానే ప్రకటించారు.

బుదవారం ఉదయం 9గంటలకు కందమామిడి జంక్షన్‌ వద్ద సర్పంచ్‌ నాగరాజు, గిరిజన సంఘం నాయకులు ఎం.ఎం.శ్రీను, ఎల్‌. సుందర్‌రావు, పాలికి లక్కు, 21 గ్రామాల గిరిజనులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అక్కడను రావడంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, నెలరోజుల్లో రోడ్డు నిర్మిస్తానని, నిర్మించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కాని అందుకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని గిరిజనులు పట్టుబడటంతో ఆమె ఆవేశంతో ఊగిపోయారు. ఇకచేసేది లేక కూర్చొన్న గిరిజనుల మద్య నుంచి ఆమెను నడుకుచుకుంటూ రోడ్డు నిర్మాణానికి మీరే అడ్డంకి అని నినాదిస్తూ వనుగుపల్లికి వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories