సాయన్న... వీడో కామాంధుడు...

సాయన్న... వీడో కామాంధుడు...
x
Highlights

వాడో మృగాడు... కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధుడు... మద్యం మత్తులో అభం-శుభం తెలియని చిన్నారిపై కన్నేశాడు. రూపాయి ఆశచూపి బాలికపై అత్యాచారయత్నం చేశాడు....

వాడో మృగాడు... కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధుడు... మద్యం మత్తులో అభం-శుభం తెలియని చిన్నారిపై కన్నేశాడు. రూపాయి ఆశచూపి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. దాంతో ఆ కామాంధుడికి స్పాట్‌లోనే తీర్పు ఇచ్చేశారు గ్రామస్తులు. సైకోను చెట్టుకు కట్టేసి కర్రలు, రాళ్లతో కొట్టిచంపేశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది.

చలనం లేకుండా పడివున్న వీడి పేరు సాయన్న... ఊరు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డోంకేశ్వర్.... మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ కామాంధుడి వేధింపులు తాళలేక ముగ్గురు భార్యలూ వదిలి వెళ్లిపోయారు... దాంతో మరింత జులాయిగా మారిన ఈ శాడిస్టు... మద్యానికి బానిసై... సైకోగా మారాడు. అయితే ఈ కామాంధుడి కన్ను... అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై పడింది. మాయ మాటలు చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే తీవ్ర రక్తస్రావంతో కన్నీళ్లు పెడుతున్న చిన్నారిని చూసి గ్రామస్తులు చలించిపోయారు. కామాంధుడ్ని చెట్టుకు కట్టేసి... కర్రలు, రాళ్లతో చితక్కొట్టారు. తీవ్ర గాయాలపాలైన సైకోను పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులెవరూ ముందుకు రాలేదు.

కామాంధుడి చేతిలో లైంగిక దాడికి గురైన చిన్నారికి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే బాలిక ఆరోగ్య పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడ్ని కొట్టిచంపిన ఘటన తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్రామస్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంతో ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories