ఉత్కంఠ కలిగిస్తున్న నెల్లూరు రాజకీయాలు...ఎమ్మెల్యే సీటు తనకే అంటున్న....

x
Highlights

నెల్లూరు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఓ నేత దూకుడు.. ఇద్దరి నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది ఆయన స్పీడ్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా తలనొప్పిగా మారుతోంది....

నెల్లూరు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఓ నేత దూకుడు.. ఇద్దరి నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది ఆయన స్పీడ్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా తలనొప్పిగా మారుతోంది. నిన్న మొన్నటి వరకూ తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పుకున్న వ్యక్తి ప్రస్తుతం ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది.

కోవూరు టీడీపీ సీనియర్ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి ఒక్క కామెంట్‌తో రాజకీయ కలకలానికి కారణమయ్యారు నిన్నమొన్నటి వరకు యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉంటూ వచ్చిన ఆయన వచ్చె ఎన్నికల్లో కోవూరు నుంచి తాను బరిలో దిగుతానని ప్రకటించడంతో అటు అధికార పార్టీ ఎమ్మెల్యే పోలంరెడ్డితో పాటు ఇటు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి నల్ల పరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైతం తలనొప్పులుగా మారింది.

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన పొలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు 2014 ఎన్నికలకు ముందు పోలంరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు టీడీపీ నుంచి టిక్కెట్ ఆఫర్ రావడంతో ఆయన టీడీపీలో చేరారు. దీంతో అప్పటి దాకా పార్టీ బలోపేతానికి కృషి చేసిన పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డికి అధిష్టానం హ్యాండిచ్చింది. అయితే అధిష్టానం ఆజ్ఞాపించడంతో పోలంరెడ్డి గెలుపుకు ఆయన కృషి చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెళ్లకూరు స్పీడ్ పెంచారు వచ్చె ఎన్నికల్లో తాను ఖచ్చితంగా కోవూరు నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పకపోయినప్పటికీ బ్యాలెట్ పేపర్‌లో డెఫినెట్ గా తన పేరుంటుదని త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని ఆయన ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఆత్మీయులు, అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి వైసీపీ, టీడీపీకి చెందిన ముఖ్యనాయకులను కలుస్తుండటంతో ఎమ్మెల్యే పోలంరెడ్డి గుర్రుగా ఉన్నారు అభ్యర్దిని మార్చే ప్రసక్తి ఉండదని, తాను మరోమారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పోలంరెడ్డి రెడ్డి చెప్పుకుంటున్నా ఆయనలో ఆందోళన లేకపోలేదు ఇక కోవూరు సీటుపై చంద్రబాబు నాయుడు సైతం క్లారిటీ ఇవ్వలేకపోవడంతో సీటు ఎవరిని వరించనుందో తెలియని పరిస్థితి పెళ్లకూరుకు కోవూరు సీటు ఇప్పించేందుకు ఓ మంత్రి తీవ్రంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది దీంతో కోవూరు సీటు పై సస్పెన్షన్ ఇప్పుడల్లా వీడేలా లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories