అబ్బాయి రాకపై స్పందించిన పవన్ కళ్యాన్!

అబ్బాయి రాకపై స్పందించిన పవన్ కళ్యాన్!
x
Highlights

తన బాబాయి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆహ్వానిస్తే తాను సిద్ధమని ఇటీవల నటుడు రామ్ చరణ్ తేజ ప్రకటించారు. దీనిపై...

తన బాబాయి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆహ్వానిస్తే తాను సిద్ధమని ఇటీవల నటుడు రామ్ చరణ్ తేజ ప్రకటించారు. దీనిపై జనసేనాని ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఎవరైనా స్వతహాగా వస్తే తాను పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పారు. అంతేగానీ తన కుటుంబ సభ్యులను రమ్మని అడగబోనని అన్నారు. అలాగే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని రమ్మని అంటానని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలని, ఇష్టపడి రావాలని అన్నారు. తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని, వారికెందుకు ఇబ్బంది? అని తాను అనుకుంటానని చెప్పారు. అంతకు మించి దీనిపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories