జనసేన మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల

x
Highlights

జనసేన ప్రీ మ్యానిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల అయ్యింది. భీమవరంలోని మావూళ్ళమ్మ దేవాలయంలో పూజలు చేసిన తర్వాత పవన్ ప్రీ మ్యానిఫెస్టోను విడుల చేశారు....

జనసేన ప్రీ మ్యానిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల అయ్యింది. భీమవరంలోని మావూళ్ళమ్మ దేవాలయంలో పూజలు చేసిన తర్వాత పవన్ ప్రీ మ్యానిఫెస్టోను విడుల చేశారు. జనసేన ప్రీ మ్యానిఫెస్టోలో 12 హామీలను పొందు పరిచారు. కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. అలాగే బీసీలకు అవకాశాన్నిబట్టి 5శాతం రిజర్వేషన్లు పెంపుదల చేస్తామనీ చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆర్థికంగా వెనుబడిన అగ్రవర్ణాలకు కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థికంగా వెనుబడిన అగ్రవర్ణాల విద్యార్థుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే SC వర్గీకరణకు సామరస్య పరిష్కారం చూపిస్తామని జనసేన ప్రీ మ్యానిఫెస్టో విజన్ డాక్యుమెంట్ హామీ ఇచ్చారు.

మహిళల్ని ఆకట్టుకోవడానికిగానూ గృహిణులకు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని జనసేన ప్రకటించింది. రేషన్‌కు బదులుగా మహిళల ఖాతాల్లో 2వేల 500 నుంచి 3 వేల 500 వరకు నగదు జమ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల CPS విధానాన్ని రద్దు చేస్తామని పవన్ తన ప్రీ మ్యానిఫెస్టో‌లో హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాల అమలు. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాల నిర్మాణం చేపడతామని జనసేన తెలిపింది. ప్రజల జీవితాల్లో వసంతాన్ని తేవడమే లక్ష్యమన్న జనసేన త్వరలో సంపూర్ణ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories