రక్తమోడుతున్న అభిమానిని చూపిస్తూ పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం

రక్తమోడుతున్న అభిమానిని చూపిస్తూ పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం
x
Highlights

కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో మూడు జిల్లాల నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్, 'జై తెలంగాణ' అని నినాదం చేస్తూ, తన...

కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో మూడు జిల్లాల నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్, 'జై తెలంగాణ' అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జన సైనికుల ఉత్సాహం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. తాను పిలిస్తే, తన కోసం వచ్చి తీవ్రంగా గాయపడిన ఓ అభిమానిని చూపిస్తూ, పవన్ కల్యాణ్ భావోద్వేగంతో మాట్లాడారు. నేడు రెండో రోజు తన 'చలోరే చల్' యాత్రలో భాగంగా మూడు జిల్లాల అభిమానులను కలిసిన ఆయన, అభిమానులు అత్యుత్సాహాన్ని ఎక్కువగా చూపవద్దని కోరారు. అద్దాలు పగిలిన కారణంగా గాయాలపాలై, చొక్కా అంతా రక్తం నిండినా, పవన్ ను దగ్గరగా చూసేందుకు ఆతృతపడుతున్న అభిమానిని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడి, అతన్ని ఆసుపత్రికి పంపించాలని సూచించారు. తానెంతో ఇష్టపడే అభిమానులకు ఇటువంటి ఘటనలు ఎదురైతే తాను తట్టుకోలేనని అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని తెలిపారు. అభిమానులు 'సీఎం సీఎం' అని నినాదాలు చేస్తుంటే వారిని వారించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories