లోక్‌సత్తా జేపీతో పవన్ భేటీ

లోక్‌సత్తా జేపీతో పవన్ భేటీ
x
Highlights

జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌... లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణతో భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ ఏర్పాటుపై జేపీతో మంతనాలు జరిపారు. విభజన హామీల సాధన కోసం...

జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌... లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణతో భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ ఏర్పాటుపై జేపీతో మంతనాలు జరిపారు. విభజన హామీల సాధన కోసం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను సాధించుకోవడంలో భాగంగా చేయాల్సిన ప్రయత్నాలపై పవన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తాను జయప్రకాశ్ నారాయణతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో చర్చిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా గురించే పవన్ ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. పలువురు నేతలతో కలిసి పవన్ కల్యాణ్ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జేపీతో పవన్ సుమారు గంట సేపు చర్చించి, ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటన చేస్తారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories