పోలీస్‌స్టేషన్‌‌కి పవన్‌ కల్యాణ్‌..!

పోలీస్‌స్టేషన్‌‌కి పవన్‌ కల్యాణ్‌..!
x
Highlights

శ్రీరెడ్డి-వర్మ ఇష్యూలో తనకు న్యాయం కావాలంటూ... మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌‌కి డెడ్‌లైన్‌ పెట్టిన పవన్‌ కల్యాణ్‌.... అటువైపు నుంచి ఎలాంటి స్పందనా...

శ్రీరెడ్డి-వర్మ ఇష్యూలో తనకు న్యాయం కావాలంటూ... మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌‌కి డెడ్‌లైన్‌ పెట్టిన పవన్‌ కల్యాణ్‌.... అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కాలని భావిస్తున్నారు. శ్రీరెడ్డి-వర్మ అండ్‌ కో వెనుక ...నారా లోకేష్‌ అండ్‌ టీమ్‌ ఉందని ఆరోపిస్తూ వస్తోన్న పవన్‌‌ మొత్తం ఎపిసోడ్‌పై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా తనపై కుట్ర జరుగుతోందంటున్న పవన్‌‌ ఓవరాల్‌ ఇష్యూపై దర్యాప్తు చేపట్టాలని కోరనున్నారు.

వరుస ట్వీట్లతో పవర్‌ పంచ్‌లు విసురుతోన్న జనసేనాని అధికార తెలుగుదేశం పార్టీ టార్గెట్‌గా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి-వర్మ ఇష్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌‌ను కార్నర్‌ చేస్తున్నారు. రోజుకో విమర్శనాస్త్రాన్ని ఎక్కుపెడుతూ తెలుగుదేశం పార్టీలో మంటలు పుట్టిస్తున్నాడు. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ట్వీట్‌ చేయడం కలకలం రేపుతోంది.

అమరావతి కేంద్రంగా తనపై కుట్ర జరుగుతోందంటున్న పవన్‌‌ ఆరు నెలలుగా ఎమోషనల్‌ అత్యాచారం చేస్తున్నారని ఆరోపించారు. నన్నూ, నా అభిమానులను, మద్దతుదారులను, స్నేహితులను, జనసైనికులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని పవన్‌ అంటున్నారు. చివరికి తన తల్లిని కూడా దూషించారంటున్న పవన్‌‌ మొత్తం ఎపిసోడ్‌పై పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories