సీఎం కేసీఆర్‌తో పవన్‌ కల్యాణ్ భేటీ

సీఎం కేసీఆర్‌తో పవన్‌ కల్యాణ్ భేటీ
x
Highlights

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తొలిసారి ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పవన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తొలిసారి ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పవన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అరగంటపాటు వీరిమధ్య చర్చ జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న కేసీఆర్ దగ్గర సలహాలను పవన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమానికి ముందు, రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన పరిణామాలపై ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. 2019 నుంచి తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రానున్న పవన్ తాజాగా కేసీఆర్‌‌తో భేటీ కావడంతో ఆసక్తికరంగా మారింది. అయితే వీరి మధ్య ఇవే కాకుండా మరిన్ని అంశాలపై కూడా చర్చ జరిగినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి చూస్తే వీరిద్దరి మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories