logo
ఆంధ్రప్రదేశ్

నా ఆఖరి శ్వాస వరకు సీమకు అండగా ఉంటా

X
Highlights

రాయలసీమ సమస్యలపై తన తుది శ్వాస వరకూ పోరాడతానన్నారు పవన్‌‌. రాయలసీమ అంటే తనకు రక్తపాతం, ఫ్యాక్షనిజం కనిపించదన్న ...

రాయలసీమ సమస్యలపై తన తుది శ్వాస వరకూ పోరాడతానన్నారు పవన్‌‌. రాయలసీమ అంటే తనకు రక్తపాతం, ఫ్యాక్షనిజం కనిపించదన్న జనసేనాని సీమ పేరు చెబితే సస్యశ్యామలమైన ప్రాంతమే గుర్తుకొస్తుందన్నారు. రాయలసీమ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్న పవన్‌‌ ప్రత్యేక రైలులో ఢిల్లీ యాత్ర చేపడదామన్నారు. ‘చలోరే.. చలోరే’ కార్యక్రమంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతపురంలోని గుత్తి రహదారిలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను జీవితంలో మరచిపోలేనని అన్నారు. త్రికరణ శుద్ధిగా ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని పేర్కొన్నారు.

Next Story