ఆ ఇద్దరి కోసం ‘అజ్ఞాతవాసి’ ప్రత్యేక ప్రదర్శన

ఆ ఇద్దరి కోసం ‘అజ్ఞాతవాసి’ ప్రత్యేక ప్రదర్శన
x
Highlights

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 25వ చిత్రం 'అజ్ఞాత‌వాసి'.. ఈ నెల 10న‌ విడుద‌ల‌కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 25వ చిత్రం 'అజ్ఞాత‌వాసి'.. ఈ నెల 10న‌ విడుద‌ల‌కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టించారు. అనిరుధ్ సంగీత‌మందించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేయనున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు స్పష్టంచేశారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను చిత్ర నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కలిశారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా చూసేందుకు రావాలని ఆయనను ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories