నవ్యాంధ్ర రైతులకు అండగా నిలుస్తాడా

నవ్యాంధ్ర రైతులకు అండగా నిలుస్తాడా
x
Highlights

అండ‌గా ఉంటాన‌న్నారు. అధికారపక్షం రెచ్చిపోతే అడ్డుకుంటాన‌న్నారు. రైతుల కోసం పోరాడ‌తామ‌న్నారు. తాను ఎవ‌రికీ బానిస‌ను కాద‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు...

అండ‌గా ఉంటాన‌న్నారు. అధికారపక్షం రెచ్చిపోతే అడ్డుకుంటాన‌న్నారు. రైతుల కోసం పోరాడ‌తామ‌న్నారు. తాను ఎవ‌రికీ బానిస‌ను కాద‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు నవ్యాంధ్ర రైతులకు అండగా నిలుస్తాడా.. పవన్‌ కల్యాణ్‌ మాటల్లో నిజమెంత?

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్లీ జనంలోకి వస్తున్నారు. గతంలో ఏపీ రాజధాని నిర్మాణ ప్రాంతంలో పర్యటించిన పవన్‌ రాజధాని కోసం భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వివిధ గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఇబ్బందులను కష్టాలను ఓపికగా విన్నారు. రైతుల కన్నీళ్లతో రాజధాని నిర్మించుకోవడం అవసరమా?, రాజధాని నిర్మాణం కోసం 8 వేల ఎకరాలు సరిపోతాయని పవన్ అన్నారు. ఈ మాత్రం భూమి కూడా రైతుల సమ్మతి లేకుండా బలవంతంగా లాక్కోవద్దని తెలుగు దేశం ప్రభుత్వానికి పవన్ సూచించారు. రైతులను ఒప్పించేందుకు పదిసాైర్లెనా వారితో చర్చలు జరపాలని కోరారు. అంతేకాని బెదిరించో, బలిమిటికో భూములను రైతులనుంచి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

తనకు కూడా గొప్ప రాజధాని కావాలని ఉందని..కానీ అది అందరి కన్నీళ్లతో కాదని అన్నారు పవన్‌. పైగా రైతుల కన్నీళ్లపై రాజధాని నిర్మాణం జరిగితే అరిష్టమని హితవు పలికారు. సింగపూర్ నిర్మాణానికి 50 సంవత్సరాలు పట్టిందని... ఇప్పుడు ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నగరం కట్టాలంటే దానికి 20 సంవత్సరాలు పడుతుందన్నారు. అన్యాయం అన్యాయమేనని...అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తానని రైతులతో ఆయన అన్నారు.

రైతుల సమస్యలను వినకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రైతుల పక్షాన ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని పవన్ హెచ్చరించారు. రైతు పొట్టగొట్టి రాజధాని బిల్డింగులు కట్టడం అంత అవసరమా? అని ఏపీ సర్కారును పవన్ ప్రశ్నించాడు. రైతులు ప్రేమతో భూములు ఇస్తే అభ్యంతరం లేదని, తానూ రైతునేనని, తన ఫామ్ హౌస్‌లో కూరగాయలు పండిస్తానని, ఆవులను పెంచుతున్నానని పవన్ వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి పవన్‌ శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాడు. ఒకపక్క ప్రభుత్వంపై విమర్శలు.. మరోపక్క రైతులకు అండగా ఉంటూ తనదన స్టైల్‌లో ముందుకు సాగుతున్నాడు జనసేనాని.

Show Full Article
Print Article
Next Story
More Stories