ఏపీలో మొదలైన ఎన్నికల హీట్

x
Highlights

ఏపీలో ఎన్నిహీట్ మెద‌ల‌య్యింది. రాజ‌కీయ‌పార్టీల‌న్నీ అప్పుడే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీని ప్రజల్లోకి...

ఏపీలో ఎన్నిహీట్ మెద‌ల‌య్యింది. రాజ‌కీయ‌పార్టీల‌న్నీ అప్పుడే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న జనసేన తగిన ఏర్పాట్లు చేస్తున్నాది. ప్ర‌జా పోరాట యాత్ర అంటూ 5 జిల్లాల్లో ప‌ర్య‌టించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ స్థానిక సమస్యలపై తనదైన దూసుకుపోతున్నారు. ఓ ప‌క్క పోరాట యాత్ర‌లు చేస్తూనే మ‌రో ప‌క్క పార్టీ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెట్టారు పవన్. వచ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీగా జ‌న‌సేన‌ను తీర్చిదిద్దాలనుకుంటున్న పవన్. అయితే కింగ్, లేదంటే కింగ్ మేకర్ అవ్వాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త సంవత్సరం నుంచి పార్టీ యాక్టివిటీ పెంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయ్యారు పవన్.

ఇప్ప‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో ఉంటూ అవ‌స‌రాన్ని బ‌ట్టి అమ‌రావతికి వెళ్లి వస్తూ ఉండే పవన్.. ఇక‌పై అమ‌రావ‌తిలోనే ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పటికే విజ‌య‌వాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ అక్కడ నుంచే ఎన్నికలకు వెళ్లనున్నారు. మరోవైపు విజయవాడలోని పడమట లంకలో ఓ భవనాన్ని తాత్కాలిక నివాసంగా పవన్ లీజుకు తీసుకున్నారు. కొత్త సంవ‌త్ప‌రం నుండి వీటి కేంద్రంగానే పార్టీ యాక్టివిటీ పెంచ‌నున్నారు. మెత్తానికి ఎన్నిక‌లు దగ్గ‌ర‌ప‌డుతున్న వేళ.. పార్టీని ప్రజల్లోకి భలంగా తీసుకువెళ్లేందుకు వేగం పెంచారు పవన్ కల్యాణ్.. హైద‌రాబాద్ లో కాకుండా ఏపిలోనే ఉంటూ క్యాడర్‌కి కొత్త జోష్ నింపాలని చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories