పవన్ కల్యాణ్ సీక్రెట్ తెలిసిపోయింది

పవన్ కల్యాణ్ సీక్రెట్ తెలిసిపోయింది
x
Highlights

రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఏం సాధిస్తాడో ఏమో కానీ.. ఆయన సినిమాలు వదిలేసేందుకు గల కారణం మాత్రం కాస్త స్పష్టంగా జనానికి.. ముఖ్యంగా అభిమానులకు ఇన్నాళ్లకు...

రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఏం సాధిస్తాడో ఏమో కానీ.. ఆయన సినిమాలు వదిలేసేందుకు గల కారణం మాత్రం కాస్త స్పష్టంగా జనానికి.. ముఖ్యంగా అభిమానులకు ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడూ సమాజం గురించి మాట్లాడే పవన్.. రెండున్నర గంటల పాటు ఓ సినిమా రూపొందించి నీతులు చెబితే జనం ఏ మాత్రం పట్టించుకోరని పవన్ తేల్చేశారు. మంచి చెబుదామని తీద్దామనుకున్న సినిమాలను కూడా అందుకే తీయలేకపోయానని పరోక్షంగా చెప్పారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు ఎన్నారైలతో మాట్లాడిన ఆయన మరిన్ని విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.

1977లో లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్.. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేసిన సందర్భం.. తనలో స్ఫూర్తి నింపిందని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితోనే సత్యాగ్రహి సినిమా తీయాలని అనుకున్నట్టు కూడా చెప్పారు. కానీ.. సినిమా ప్రభావం మహా అయితే ఒకరోజు.. లేదంటే రెండు రోజులు ఉంటుంది కానీ.. జనాల్లోకి వచ్చి సేవ చేసేంతగా వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయించేంత ప్రభావం కలిగించలేదని తనకు అర్థమైనట్టు చెప్పుకొచ్చారు.

దీంతో.. పవన్ రాజకీయాల గురించి కాసేపు పక్కన పెడుతున్న అభిమానులు, సినీ వర్గాలు.. ఇదే కారణంతో పవన్ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు విరామం ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. ఎప్పుడూ.. సమాజం.. ప్రజలు.. అని మాట్లాడే పవన్.. ఇలా సినిమాలతో.. అలాంటి మాటలు మాట్లాడినా చెప్పినా అంతగా ఫలితం ఉండదు కాబట్టే వాటిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసినట్టుగా అంతా భావిస్తున్నారు. ఇది నిజమో కాదో.. పవన్ కల్యాణే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories