వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..
x
Highlights

కరీంనగర్‌‌లో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ హైఓల్టేజ్‌ స్పీచ్‌ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల...

కరీంనగర్‌‌లో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ హైఓల్టేజ్‌ స్పీచ్‌ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలనుద్దేశించి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్‌ ఆంధ్రా జన్మనిస్తే...తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందన్నారు. కొండగట్టు ఆంజనేయుడే తనకు పునర్జన్మనిచ్చాడని భాగద్వేగానికి గురయ్యారు. తెలంగాణ నేలకు ఆఖరి శ్వాస వరకు రుణపడి ఉంటానన్నారు. వందేమాతరంలాంటి నినాదమే జైతెలంగాణ అన్న జనసేనాధిపతి వందేమాతరానికున్న శక్తి జైతెలంగాణ పదానికి ఉందన్నారు.

తెలంగాణలో ఉండే భావోద్వేగమే తనలోనూ ఉందన్నారు పవన్ కల్యాణ్‌. అందుకే తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టం, ప్రేమ అన్నారు. తన జీవితంలో అధిక భాగం తెలంగాణలోనే గడిచిందన్న జనసేనాని తెలంగాణ అంటే ఎంతిష్టమో తన సినిమాల్లో కనిపిస్తుందన్నారు. తెలంగాణ యాస భాషలకు తన సినిమాల్లో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. తెలంగాణ కళలు, సంస్కృతిని సినిమాల్లో చూపించానన్నారు. మన యాస, సంప్రదాయాల్ని గౌరవించే రాజకీయం కావాలన్న పవన్‌ ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదమే జనసేన లక్ష్యమని ప్రకటించారు. ప్రాంతీయతను గౌరవించకుంటే విభేదాలు వస్తాయన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత గొడవల్లేవన్న పవన్ కేవలం విధివిధానాలపైనే పోరాటమని మరోసారి ప్రకటించారు.

నాలుగేళ్ల పసిబిడ్డ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పవన్‌. తెలంగాణ ప్రజల కోసం రోడ్డుమీదకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్న జనసేనాని మాట ఇస్తే ఆఖరి వరకూ నిలబడి తీరుతానన్నారు. తల తెగేవరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. సమస్యలను ఎత్తిచూపుతా, పరిష్కారానికి కృషిచేస్తా సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటానికి దిగుతానన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం ఎవరితోనైనా విభేదిస్తా గొడవపడతానన్న పవన్‌‌ పోరాటం తన ఆఖరి అస్త్రమన్నారు. తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్న పవన్‌‌ తెలంగాణ తల్లికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తనకు పదవులు అవసరం లేదన్న పవన్‌‌ దేశం కోసం నా గుండె కొట్టుకుంటోందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories