అభిమానులకు పవన్‌ షాక్‌..సినిమాలకు ఇక గుడ్ బై

x
Highlights

కరీంనగర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన పవన్‌.... భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. రేపు, ఎల్లుండి మరోసారి కార్యకర్తలతో సమావేశం కానున్నారు....

కరీంనగర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన పవన్‌.... భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. రేపు, ఎల్లుండి మరోసారి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కార్యకర్తల సమావేశంలో తెలంగాణలోని ప్రజాసమస్యలపై చర్చించనున్నట్టు పవన్‌ తెలిపారు. ఈ నెల 27 నుండి అనంతపురం కరవుపై యాత్ర చేపట్టనున్నట్టు జనసేన అధినేత పవన్‌ ప్రకటించారు. అనంతపురంలో పార్టీ ఆఫీస్‌ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ పాదయాత్రతో అనంతపురం కరవును కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు గౌరవం ఇవ్వాలని గొడవలతో సమస్యలు పరిష్కారం కావని పవన్‌ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో తాను మాట్లాడుతున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సున్నిత అంశాలు చాలా ఉన్నాయని, ఇరు రాష్ట్రాల్లోనూ నిర్మాణాత్మక రాజకీయ పాత్ర పోషిస్తామని పవన్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి జనసేన అధినేత పవన్‌ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన బలమేంటో తెలుస్తుందన్నారు. అభిమానులకు పవన్‌ షాకిచ్చారు. సినిమాలపై తనకిక దృష్టి లేదని తేల్చి చెప్పారు. పాదయాత్రతో పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్‌... సినిమాలను వదులుకుంటున్నట్టు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories