పవన్ యాత్రకు బ్యాక్ టూ బ్యాక్ బ్రేక్‌లు

x
Highlights

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రతో జగన్‌ ఫుల్‌ స్పీడ్‌లో ఉంటే....జనసేనాని మాత్రం...

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రతో జగన్‌ ఫుల్‌ స్పీడ్‌లో ఉంటే....జనసేనాని మాత్రం యాత్రకు బ్రేకులు వేస్తున్నారు. ఇది ఇప్పుడు జనసేన హాట్‌ టాపిక్‌గా మారింది. పూర్తి స్థాయిల్లో ప్రజల్లోకి వెళ్లాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నా...అందుకు పార్టీ కేడర్‌ మాత్రం సహకరించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయ్.

ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర‌ల సీజ‌న్ న‌డుస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు జ‌నంలోకి వెళ్లేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌ యాత్రతో ప్ర‌జ‌ల్లో ఉన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌....అదే బాట ప‌ట్టారు. ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఏపీలో ప‌వ‌న్ యాత్ర‌కు మంచి పేరు వ‌స్తున్నప్పటికీ... అందుకు త‌గ్గ‌ట్లుగా కేడ‌ర్ మాత్రం పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయ్.

గతంలో పూర్తీ స్థాయి యాత్రలు చేసిన అనుభ‌వం ప‌వ‌న్‌కు లేకపోయినప్పటికీ....త‌న‌దైన స్థాయిలో అధికార‌ పార్టీని కార్న‌ర్ చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న ప‌వ‌న్ స్పీడ్‌ను అందుకోవ‌డంలో... కేడ‌ర్ కాస్త వెనుకబ‌డుతుంద‌నే టాక్ ఇప్పుడు జ‌న‌సేన వ‌ర్గాల్లో వినిపిస్తోంది. యాత్ర ఏర్పాట్ల అంశంలో స్థానిక నేత‌ల‌కు... ప‌వ‌న్‌తో వ‌చ్చిన నేత‌ల‌కు అస్స‌లు పొస‌గ‌టంలేద‌నే టాక్ విన‌బ‌డుతోంది. ఇందులో భాగంగానే ప‌వ‌న్ యాత్రకు అక్క‌డ‌క్క‌డ బ్రేకులు ప‌డుతున్నాయ‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయ్.

పాదయాత్ర ప‌ర్య‌వేక్ష‌ణ బాథ్య‌త‌లు చూస్తున్న కొందరికి...అనుభవం లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ వ‌చ్చేసరికి ఏర్పాట్లు మొత్తం గంద‌ర‌గోళంగా మారుతున్నాయ్. తీరా అధినేత స్పీచ్ మొదలెట్టేస‌రికి ఎదో ఒక ఆటంకం ఏర్పాడుతోంది. దీంతో పవన్ యాత్రకు బ్యాక్ టూ బ్యాక్ బ్రేక్‌లు పడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories