పవన్ కళ్యాణ్ సంచనల వ్యాఖ్యలు...తనను చంపడానికి ఆ ముగ్గురు కుట్ర

x
Highlights

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోరాట యాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి ముగ్గురు క్రిమినల్స్ కుట్ర...

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోరాట యాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి ముగ్గురు క్రిమినల్స్ కుట్ర చేస్తున్నారని అన్నారు. వారు మాట్లాడుకున్న వాయిస్ క్లిప్ తనదాకా వచ్చిందని పవన్ చెప్పారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్న వారి పేర్లు, ముఖాలు కూడా తనకు తెలుసునని పవన్ వివరించారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాడిలో పెట్టడంలో డిజిపి వైఫల్యం చెందారని...అందుకే ఇలాంటి కిరాయి హంతకులు రెచ్చిపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై కుట్రలు చేస్తున్న వారు అధికారపక్షమో,ప్రతిపక్షమో తెలీదన్నారు. ఇదే సమయంలో తనపై కుట్రలు చేస్తున్న వారెవరో తెలుసంటూ పవన్ వ్యాఖ్యానించడం కొత్త చర్చలకు తెరలేపింది. పాలక, ప్రతిపక్షాల్లో జనసేన వైపు చూస్తున్న కొందరు నేతలు ఈ తరహా ప్రచారం చేస్తున్నట్టు భావిస్తున్నారు

పాలక, ప్రతిపక్షాలపై తాను పోరాడుతన్నానని చెప్పిన పవన్ 2014 ఎన్నికల్లో టీడీపీ నేతలు కోరడం వల్లే మద్ధతిచ్చానన్నారు. ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు గతాన్ని ఓ సారి గుర్తు చేసుకోవాలంటూ సూచించారు. అయితే పవన్ భద్రతపై పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించాలంటున్నారు జనసేన నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories