నెక్లెస్ రోడ్డులో పవన్ మౌన దీక్ష
Highlights
కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తనను ఎంతో కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
arun14 April 2018 9:26 AM GMT
కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తనను ఎంతో కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కథువా ఘటనకు నిరసనగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేపట్టారు. మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదని ఏదైనా దారుణం జరిగితే కానీ మనలో చలనం రావడం లేదని చెప్పారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు. కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా అని అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని... అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుందని మానవ మృగాలకు ఎలాంటి నియమాలు లేకుండా పోయాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లైవ్ టీవి
భారత మార్కెట్లో డెల్ జి5 5090 గేమింగ్ డెస్క్టాప్
14 Dec 2019 3:19 PM GMTబొగ్గుగని శీనుతో కేథరిన్
14 Dec 2019 3:15 PM GMT'ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు' అందుకున్న సింగరేణి...
14 Dec 2019 3:04 PM GMTచంటి టు వెంకీమామ .. వెంకీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
14 Dec 2019 2:35 PM GMTలేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్
14 Dec 2019 2:15 PM GMT