ప్రయోగాల పుట్ట “జాని” సినిమా చిట్టా

ప్రయోగాల పుట్ట “జాని” సినిమా చిట్టా
x
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ కథాకథనదర్శకత్వంలో రూపొందించబడ్డ తెలుగు చలన చిత్రం. ఈ సినిమా 2003 ఏప్రిల్ 25న అట్టహాసంగా, ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ కథాకథనదర్శకత్వంలో రూపొందించబడ్డ తెలుగు చలన చిత్రం. ఈ సినిమా 2003 ఏప్రిల్ 25న అట్టహాసంగా, ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైననూ, వాణిజ్యపరంగా విజయం పెద్ద సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ నటజీవితంలోనే ఇది ఒక వైఫల్యంగా ఈ చిత్రం పేరు తెచ్చుకొన్నది. అయితే ఈ సినిమాలో పవన్ చాల ప్రయోగాలూ చేసాడు అందులో.. మొదటిది.. లైవ్ రికార్డింగ్, అంటే ..సాధారణంగా చిత్రాలు షూటింగ్ అయిన తర్వాత డైలాగులను రికార్డు చేస్తారు. కానీ ఈ చిత్రానికి డైలాగులను అక్కడికక్కడే రికార్డు చేసారు. రెండోది...రీ-మిక్స్ పాట... అది చిట్టి చెల్లెలు చిత్రంలోని ఈ రేయి తీయనిది గీతాన్ని రీ-మిక్స్ చేశారు. ఇక ముద్దుగా మూడోది.. ఒక పేరడీ ..అదేంటంటే..రావోయి మా ఇంటికి పాటని రావోయి మా కంట్రీకి అని చమత్కరించాడు. ఈ పాట స్వయంగా పవనే ఆలపించటం ఒక విశేషం. అలాగే నాలుగోది.. పూర్తి నిడివి ఆంగ్ల గీతం లెట్స్ గో జానీ పూర్తి నిడివి ఆంగ్ల గీతం. ఇధవధి..ఆంగ్ల తెలుగుల మేళవింపు: దేర్ వాజ్ ఎ కూల్ అండ్ లవ్లీ బ్రీజీ ఈవెనింగ్ గీతం సగభాగం ఆంగ్లంలో సగభాగం తెలుగులో ఉంటుంది. అయితే ఇన్ని ప్రయోగాలూ చేసిన..... సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఇందులోని సాంకేతిక విలువలను అభినందించలేక పోయాడు.
బాక్స్ ఆఫీసు వద్ద విజయానికి నోచుకోలేకపోయినా "జానీ" సినీ విమర్శకుల అభిమానాన్ని చూరగొంది. స్టోరీలో హీరొయిన్ని ఒక అనారోగ్యంతో చూపెట్టడం వల్ల కూడా కొంత యువకులకి నచ్చక పోయివుండవచ్చు. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories