భూ కబ్జాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది

భూ కబ్జాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది
x
Highlights

ఏపీ ప్రభుత్వంపై జనసేనాని మరోసారి విమర్శలకు దిగారు. అమరావతి నిర్మాణం కోసం బలవంతంగా భూసేకరణ చేపడితే మరో ఉద్యమం తప్పదంటూ ఆయన ట్వీట్ చేశారు. రాజధాని...

ఏపీ ప్రభుత్వంపై జనసేనాని మరోసారి విమర్శలకు దిగారు. అమరావతి నిర్మాణం కోసం బలవంతంగా భూసేకరణ చేపడితే మరో ఉద్యమం తప్పదంటూ ఆయన ట్వీట్ చేశారు. రాజధాని రైతుల ఆవేదన తెలుసుకునేందుకు మరోసారి సమావేశమవుతానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. భూముల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే భూకబ్జాలకు అండగా నిలుస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. తాను చేపట్టిన పోరాట యాత్ర 26 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపధ్యంలో పవన్ ట్వీట్లు ఆసక్తి రేపుతున్నాయి. గత కొద్ది కాలంగా కంటి సమస్యతో బాధపడుతున్న పవన్‌కు ఈనెల 24న ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేయనున్నారు. రెండు రోజుల విరామ అనంతరం వపన్ పోరాట యాత్రను ప్రారంభించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories