చంద్రబాబుపై పవన్ తొలిసారి సుతిమెత్తగా విమర్శలు

చంద్రబాబుపై పవన్ తొలిసారి సుతిమెత్తగా విమర్శలు
x
Highlights

జేఏసీతో పాటు పవన్‌ కీలకమైన వ్యాఖ్య మరోటి ఏంటంటే, చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం పోతోందనడం. మొన్నటి వరకూ చంద్రబాబు సర్కారును ఒక్క మాటా అనడం లేదని...

జేఏసీతో పాటు పవన్‌ కీలకమైన వ్యాఖ్య మరోటి ఏంటంటే, చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం పోతోందనడం. మొన్నటి వరకూ చంద్రబాబు సర్కారును ఒక్క మాటా అనడం లేదని విమర్శలు ఎదుర్కొన్న పవన్, తొలిసారి టీడీపీ సర్కారును సుతిమెత్తగా విమర్శించి, ఫ్యూచర్‌ ప్లాన్‌పై క్లారిటీ ఇచ్చారు...కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్లారిటీ లేదని, నిధుల విడుదలపై ఒక్కొక్కరూ ఒక్కోమాట చెబ్తున్నారని, జనాలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని అన్నారు పవన్. మరి నాలుగేళ్లలో కేంద్రం ఏం ఇచ్చిందో, రాష్ట్రానికి ఏం దక్కిందో పవన్‌ క్లారిటీ నిజంగా లేదా....లేదంటే ఇదొక ఎత్తుగడనా?

టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం పోతుందన్న పవన్
నాలుగేళ్లవుతున్నా, చంద్రబాబు ప్రభుత్వంపై పల్లెత్తు మాటా అనకుండా, టీడీపీకి జనసేన బీ టీంగా మారిందని విమర్శలపై కొద్దికొద్దీగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్. 2019లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు సంకేతాలైతే ఇచ్చారని అనిపిస్తోంది. ఎందుకంటే, చంద్రబాబు సర్కారుపై తొలిసారి కొంత క్లారిటీగా విమర్శలు చేశారు పవన్. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం పోతుందన్నారు. కేంద్రం నుంచి నిధులు ఎన్ని వచ్చాయో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు గందరగోళ పరుస్తున్నాయని విమర్శించారు.

ప్రత్యేక ప్యాకేజీపై చంద్రబాబు తీరు గందరగోళం-పవన్
ప్రత్యేక హోదాను మేనిఫెస్టోలో పెట్టి, బీజేపీ పక్కనపెట్టేసిందన్నారు పవన్. తిరుపతి, కాకినాడలలో జనసేన సభల తర్వాత కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. అప్పుడు బాబు కూడా దానికి మద్దతు పలికారన్నారు. ప్యాకేజీ ఒకసారి బాగుందంటారని మరోసారి బాగోలేదంటారని చంద్రబాబుపై వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయని విమర్శించారు.

కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లెక్కలు చెప్పదు-పవన్
కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, రాష్ట్ర ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదన్నారు పవన్. రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదని కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారని చెప్పారు. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీపై క్లారిటీ లేదని పదేపదే చెప్పారు పవన్. అయితే క్లారిటీ లేదంటున్న పవన్‌ వైపు, నాలుగేళ్లలో ఎందుకు క్లారిటీ రాలేదన్న ప్రశ్నలూ దూసుకొస్తున్నాయి. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి, నిధుల విడుదలపై ఫుల్‌ క్లారిటీకి రావొచ్చు. కానీ క్లారిటీ లేదని చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి.

మొత్తానికి జేఏసీ ఏర్పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల పంపిణీపై క్లారిటీ లేదనడం, చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం పోతోందనడం, ఈసారి పవన్‌ మీడియా సమావేశంతో ముఖ్యమైన అంశాలుగా చెప్పాలి. మరి జేఏసీ ఏర్పాటు చేస్తారా...భవిష్యత్తులో మోడీ, చంద్రబాబు సర్కార్లపై మరింత దూకుడుగా, సూటిగా సుత్తిలేకుండా విమర్శలు చేస్తారా అన్నదాని బట్టే, పవన్‌ ఫ్యూచర్‌ ప్లాన్‌పై ఫుల్‌ క్లారిటీ వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories