పవన్ కల్యాణ్ కు వీరాభిమాని షాక్

x
Highlights

పవన్ కల్యాణ్ కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. ఒక్కసారిగా స్టేజ్ పైకి వచ్చి పవన్ కల్యాణ్ ను గట్టిగా పట్టుకున్నాడు. పక్కన ఉన్నవాళ్లు అతన్ని నెట్టేసేందుకు...

పవన్ కల్యాణ్ కు ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. ఒక్కసారిగా స్టేజ్ పైకి వచ్చి పవన్ కల్యాణ్ ను గట్టిగా పట్టుకున్నాడు. పక్కన ఉన్నవాళ్లు అతన్ని నెట్టేసేందుకు ప్రయత్నించారు. అయినా పవన్ కల్యాణ్ ను వదల్లేదు. చివరకు పవన్ నే నచ్చచెప్పడంతో వదిలేశాడు. షాక్ నుంచి తేరుకున్న పవన్ ఆ అభిమానితో సెల్ఫీ దిగారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఓ వీరాభిమాని తన అభిమానాన్ని చాటుకున్నాడు. అనంత బహిరంగ సభలో జనసేనాని మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా వేదికపైకి వచ్చిన వీరాభిమాని అమాంతం పవన్‌‌ను తన చేతులతో బంధించాడు. పవన్‌ కల్యాణ్‌ కూడా అంతే ప్రేమగా వీరాభిమానిని స్వీకరించి దగ్గరికి తీసుకున్నాడు. వీరాభిమాని దాదాపు 40 సెకన్లపాటు తన ఆత్మీయ కౌగిట్లో బంధించాడు. ఎంతమంది విడిపించే ప్రయత్నం చేసినా పట్టువదల్లేదు. అలాగే గట్టిగా పట్టుకున్న అభిమానికి సర్దిచెప్పిన పవన్‌‌ స్వయంగా సెల్ఫీ దిగి వీరాభిమానిని ప్రేమగా కిందికి పంపాడు.

తాడిపత్రికి చెందిన ఫయాజ్‌‌ పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని. పవన్‌ అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తెలుసుకున్న ఫయాజ్‌ జనసేన పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ ఏర్పాటుచేసిన వేదికపై మాట్లాడిన పవన్‌‌తో సెల్ఫీ దిగాలనుకున్న ఫయాజ్‌‌ జనసేనాని స్పీచ్‌ ముగియగానే చటుక్కున వేదికపైకి ఎక్కి అమాంతం పవన్‌ను తన ఆత్మీయ కౌగిలిలో బంధించాడు. ఫయాజ్‌ వీరాభిమానాన్ని అర్ధంచేసుకున్న పవన్‌ అంతే ప్రేమతో అతడ్ని దగ్గరకి తీసుకున్నాడు. ఎంతమంది విడిపించే ప్రయత్నం చేసినా పట్టువదలకుండా 40 సెకన్లపాటు గట్టిగా పట్టుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories