పవన్‌ కల్యాణ‌్ అనంత షెడ్యూల్ ఖరారు

పవన్‌ కల్యాణ‌్ అనంత షెడ్యూల్ ఖరారు
x
Highlights

అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్‌ టూర్‌కు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. మూడు రోజుల పాటు పవన్‌ కల్యాణ్‌ అనంతపురంలో పర్యటించనున్నారు. 11.20 నిమిషాలకు జనసేన...

అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్‌ టూర్‌కు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. మూడు రోజుల పాటు పవన్‌ కల్యాణ్‌ అనంతపురంలో పర్యటించనున్నారు. 11.20 నిమిషాలకు జనసేన పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు రైతులు, నీటి పారుదల రంగం నిపుణులతో చర్చించనున్నారు. 28న ఉదయం కదిరి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకొని కరవు పరిస్థితులపై స్థానికులతో చర్చించనున్నారు. సాయంత్రం నాలుగున్నరకు పుట్టపర్తి చేరుకొని సత్యసాయి మందిరం, ఆసుపత్రిని సందర్శించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. 29న చేనేత కళాకారులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి హిందూపురం వెళ్లి జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories