పక్కపక్కనే నిల్చున్నా పలకరించుకోని చంద్రబాబు, పవన్!

x
Highlights

గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ‌్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురెదురు పడ్డారు. అయినా ఒకరిని...

గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ‌్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురెదురు పడ్డారు. అయినా ఒకరిని ఒకరు కనీసం మాట వరసకు కూడా పలకరించుకోలేదు. ఇద్దరు నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటూనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో వేర్వేరుగా వెళ్లిన ఇద్దరు నేతలు .. వేర్వేరుగానే స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం ఇరువురు నేతలు ఒకేసారి బయటకు వచ్చినా ఒకరి వైపు మరోకరు కనీసం చూసుకోలేదు. బాబు స్ధానికులతో మాట్లాడుతుండగానే పవన్ అక్కడి నుంచే వేగంగా బయటకు వెళ్లిపోయారు. బయట పలువురు టీడీపీ నేతలున్నా ఆయన జనసేన కార్యకర్తలతో పాటు వెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతిచ్చిన పవన్ కళ్యాన్ ఇటీవల కాలంలో ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా అదే స్ధాయిలో విమర్శలు చేస్తూ ఉండటంతో ఇరువురి మధ్య గ్యాప్ పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories