పాక్ లో పరి మూవీ బ్యాన్

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజా చిత్రం ‘పరి’ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ఈ మూవీలో అనుష్క శర్మ నటనకు...
బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజా చిత్రం ‘పరి’ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ఈ మూవీలో అనుష్క శర్మ నటనకు విమర్శలకు నుంచి ప్రశంసలు దక్కాయి… కథ బలంగా అంతగా లేకపోయి… భయపెట్టే సన్నివేశాలతో సినిమా రక్తి కట్టించిందని రివ్యూస్ ప్రశంసలు కురిపించాయి. మొత్తానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన తర్వాత వచ్చిన తొలి సినిమా విజయాన్ని అనుష్క శర్మ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మూవీపై పాకిస్థాన్ నిషేధం విధించింది. ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకంగా, ముస్లిం మనోభావాలను కించపరచేలా ఈ మూవీ ఉందంటూ… పాక్‌లో ఈ మూవీని విడుదల చేయకుండా బ్యాన్ విధించినట్టు ఓ పత్రిక కథనం.
ఇక ఖురాన్ సూక్తులతో కూడిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు సైతం ఈ సినిమాలో ఉన్నాయంటూ పాకిస్థాన్ సెన్సార్ బోర్డు కూడా ఈ హారర్ మూవీపై నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. ఖురాన్ సూక్తులను హిందూ మంత్రాలతో మిక్స్ చేయడమే కాకుండా… ముస్లింలను తక్కువ చేసి చూపించారంటోంది పాక్ సెన్సార్ బోర్డు. ఇప్పటికే ఈ సినిమా విడుదల చేసేందుకు పాక్‌లోని కొన్ని థియేటర్లు సిద్ధమై… టికెట్లను కూడా విక్రయించాయి… తాజా నిషేధంతో అమ్మిన టిక్కెట్లకు డబ్బులు తిరిగి ఇస్తున్నట్టు కొన్ని థియేటర్లు ప్రకటించాయి. ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నటించడమే కాదు… అనుష్క శర్మే ‘పరి’ మూవీని స్వయంగా నిర్మించింది. మరోవైపు ఈ మూవీని చూసి అనుష్క శర్మ నటపై టీమిండియా కెప్టెన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
IPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMT