బ్రేకింగ్ : జగన్ వ్యాఖ్యలతో పరకాల రాజీనామా

బ్రేకింగ్ : జగన్ వ్యాఖ్యలతో పరకాల రాజీనామా
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకు పంపారు. ప్రతిపక్ష నేత...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకు పంపారు. ప్రతిపక్ష నేత జగన్...అవమానించేలా మాట్లాడారంటూ...మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపించారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన లేఖలో కోరారు. నిన్న పి.గన్నవరం బహిరంగ సభలో ప్రభాకర్ పై వై.ఎస్.జగన్ చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెంది ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పరకాల ప్రభాకర్ భార్య బీజేపీకి చెందిన నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నే నిన్న జగన్ లేవనెత్తారు. కేంద్రంతో భాగంగా ఉన్న మంత్రి భర్తను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకున్నాడని విమర్శించారు. దీంతో ఆవేదన చెందిన ప్రభాకర్ రాజీనామా చేశారు. నాలుగేళ్లుగా ప్రభాకర్ ఏపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యమంత్రి ఆయనకు బాగా ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదిస్తారో లేడో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories