వీడియోల్లో బ‌ట్ట‌బ‌య‌లైన గ‌జ‌ల్ లైంగిక వేధింపులు

x
Highlights

గజల్‌ శ్రీనివాస్‌ కుమారి అనే అమ్మాయిని వేధించడంతోనే అరెస్ట్ చేశామన్నారు పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌. గత రెండు నెలల నుంచి శ్రీనివాస్ కుమారిని...

గజల్‌ శ్రీనివాస్‌ కుమారి అనే అమ్మాయిని వేధించడంతోనే అరెస్ట్ చేశామన్నారు పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌. గత రెండు నెలల నుంచి శ్రీనివాస్ కుమారిని వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేకనే బాధితురాలు డిసెంబర్ చివరి వారంలో తమకు ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఫిర్యాదుతో పాటు గజల్‌ శ్రీనివాస్‌ వేధింపులకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు తమకు అందించినట్టు చెప్పారు. అయితే తాము ప‌రిశీలించిన వీడియోల్లో కుమారిని లైంగికంగా వేధించిన దృశ్యాలు ఉన్నాయ‌న్నారు. బాధితురాలిని వేధించ‌డం. ఆమెతో మసాజ్ చేయించుకోవడం బలవంతంగా హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం, కాళ్లు ఒత్తిచ్చుకోవడం వంటి దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయని ఏసీపీ తెలిపారు. దీంతో గ‌జ‌ల్ పై 354, 354ఏ, 509 సెక్షన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేశామని కేసుకు సంబంధించిన స‌మాచారం కోసం బాధితురాలి ఫిర్యాదు తర్వాత ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులో కూడా కొంతమంది ఉద్యోగులను విచారించామని తెలిపారు. అనంతరం పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్‌ను ఇవాళ అరెస్టు చేశామని ఏసీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories