కొంపముంచిన సరోగసి... దళిత మహిళపై అఘాయిత్యం

x
Highlights

విశాఖపట్నంలో ఓ దళిత మహిళ పట్ల పద్మశ్రీ ఆసుపత్రి దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆమె అనుమతి లేకుండానే సరోగసీ పద్దతి ద్వారా ఆమెను గర్భవతిని చేసింది. ఈ...

విశాఖపట్నంలో ఓ దళిత మహిళ పట్ల పద్మశ్రీ ఆసుపత్రి దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆమె అనుమతి లేకుండానే సరోగసీ పద్దతి ద్వారా ఆమెను గర్భవతిని చేసింది. ఈ విషయం ఆమెకు తెలియడంతో ఆసుపత్రి వర్గాలను నిలదీసింది. మహిళా సంఘాల సాయంతో ఆసుపత్రి యాజమాన్యంపై పోరాటం చేస్తోంది. వెంటనే తనకు అబార్షన్ చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

విశాఖపట్నంలో ఓ దళిత మహిళ పట్ల పద్మశ్రీ ఆసుపత్రి దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆమె అనుమతి లేకుండానే సరోగసీ పద్దతి ద్వారా ఆమెను గర్భవతిని చేసింది. ఈ విషయం ఆమెకు తెలియడంతో ఆసుపత్రి వర్గాలను నిలదీసింది. బండారం బయట పడడంతో ఆసుపత్రి వర్గాలు ఆమెపై ఒత్తిడి పెంచాయి. 3లక్షలు ఇస్తేనే.. అన్నీ సవ్యంగా చేసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోంది. పద్మశ్రీ ఆసుపత్రి తనను ఏ విధంగా చిత్ర హింసలకు గురిచేస్తుందో వివరిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు కూడా ఆమె గోడు వినలేదు. ఆసుపత్రిపై చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఆసుపత్రి యాజమాన్యం అక్రమాలను వారికి వివరించింది. మహిళా సంఘాల సాయంతో ఆసుపత్రి యాజమాన్యంపై పోరాటం చేస్తోంది. వెంటనే తనకు అబార్షన్ చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

మధురవాడ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత భర్తతో విభేదాల కారణంగా తల్లివద్ద ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. తల్లి వద్దే ఉంటూ పిల్లలను పోషించుకోవాలని భావించింది. ఉపాధి కోసం ప్రయత్నించే క్రమంలో కొందరు దళారుల కంట పడింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న దళారులు.. ఆమెను పద్మశ్రీ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఎగ్స్ డొనేట్ చేస్తే 20 వేలు ఇస్తారని నమ్మించి.. ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచిన సిబ్బంది అసలు విషయాన్ని ఆమెకు మెల్లగా చెప్పారు. సరోగసీ చేశామని, మరో 9 నెలలు ఆసుపత్రి విడిచి వెళ్లడానికి వీళ్లేదని ఆమెపై ఒత్తిడి చేశారు. దీంతో విస్తుపోయిన ఆమె... ఆసుపత్రి సిబ్బంది కళ్లు కప్పి అక్కడి నుంచి బయటపడింది.

పద్మశ్రీ ఆసుపత్రి నుంచి బయటపడిన బాధితురాలు... తర్వాత పోలీసులను ఆశ్రయించింది. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో మహిళా సంఘాల వద్దకు వెళ్లింది. మహిళా సంఘాలు నాగలక్ష్మికి అండగా నిలిచాయి. ఆమెకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు అండగా నిలిచారు. మహిళా సంఘాలతో కలిసి ఆసుపత్రిపై పోరాటానికి దిగింది. ఆసుపత్రిపై కేసు నమోదు చేసి, బాదితురాలికి అండగా నిలవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పద్మశ్రీ ఆసుపత్రి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాగలక్ష్మి విషయంలో పోలీసులు ఆచితూచి స్పందించారు. ఇది మెడికో లీగల్ కేసని, అబార్షన్ చేయించుకోవాలంటే మెజిస్ట్రేట్ ఆదేశాలు తప్పనిసరని చెబుతున్నారు. ఈ కేసును మరింత విచారించి, బాదితురాలికి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. సరోగసీ విధానంపై మనదేశంలో ఎన్నో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటిని చాలా ఆసుపత్రులు బేఖాతరు చేస్తున్నాయి. ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజల అమాయకత్వంతో ఆటలాడుతున్నాయి. ఇటువంటి ఆగడాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories