మనలో దేశబక్తిని పెంచే పాట

మనలో దేశబక్తిని పెంచే పాట
x
Highlights

కొన్ని పాటలు.. మానని ఆహ్లాద పరచడమే కాదు.... మనలో దేశబక్తిని కూడా పెంచుతాయి.. అలాగే ఆలోచింపచేస్తాయి.. అలాంటి పాటే ఈ ...పాడవోయి భారతీయుడా అనే ఈ పాట...

కొన్ని పాటలు.. మానని ఆహ్లాద పరచడమే కాదు.... మనలో దేశబక్తిని కూడా పెంచుతాయి.. అలాగే ఆలోచింపచేస్తాయి.. అలాంటి పాటే ఈ ...పాడవోయి భారతీయుడా అనే ఈ పాట 1961లో విడుదలైన వెలుగు నీడలు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయితలు ఆత్రేయ, శ్రీ శ్రీ, గానం ఘంటసాల, పి. సుశీల, మాధవపెద్ది సత్యం, వెంకటేశ్వరరావు, స్వర్ణలత. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, గిరిజ, ఎస్.వి. రంగారావు, రేలంగి, సూర్యకాంతం. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు,

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

పాడవోయి భారతీయుడా

నేడె స్వాతంత్ర్య దినం వీరుల త్యాగ ఫలం

నేడె స్వాతంత్ర్య దినం వీరుల త్యాగ ఫలం

నేడె నవోదయం నీదే ఆనందం ఓ..

పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ..

పాడవోయి భారతీయుడా

ఓ ఓ ఓ ఓ

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ

సంబర పడగానే సరిపోదోయి

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ

సంబర పడగానే సరిపోదోయి

సాధించిన దానికి సంతృప్తిని పొందీ

అదె విజయమనుకుంటె పొరపాటోయి ఆగకోయి భారతీయుడా

కదలి సాగవోయి ప్రగతి దారులా............

ఇది కొంచెం పెద్ద పాటే అయినా.. అందరిని ఆలోచింప చేసే పాట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories