ప‌వ‌న్ ను తెలంగాణ‌లో తిర‌గ‌నివ్వం

lakshman
Updated on: 24 Dec 2018 12:36 PM IST
ప‌వ‌న్ ను తెలంగాణ‌లో తిర‌గ‌నివ్వం
X


పవన్‌కళ్యాణ్ - కత్తి మహేష్ ల మధ్య వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ వివాదంలో ప‌వ‌న్ కు అభిమానులు, పూన‌మ్ మ‌రికొంత‌మంది ఇండ‌స్ట్రీకి చెందిన వారు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇదిలా ఉంటే ఓయూ జేఏసీ విద్యార్ధుల‌తో క‌త్తి భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యార్ధి సంఘం నాయ‌కులు క‌త్తికి మ‌ద్ద‌తు ప‌లికారు. కత్తి మహేష్‌పై పవన్ అభిమానులు దాడి చేస్తే.. పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వమని జేఏసీ విద్యార్థులు హెచ్చరించారు. కత్తికి మద్దతుగా విద్యార్థులు ‘పవన్‌కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్‌ తన అభిమానులను వేరే పార్టీలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నాపై పవన్‌ తన అభిమానులను ఉసిగొల్పుతున్నారు, పవన్‌ తన అభిమానులను అదుపులో పెట్టుకోవాలని అన్నారు.

lakshman

lakshman

Next Story