గంపెడాశలు పెట్టుకున్నఓయూ నేతల అంచనాలు తారుమారు...

x
Highlights

తెలంగాణ ఏర్పాటు తరువాత వచ్చిన 2014 ఎన్నికల్లో ఓయూ జేఏసి నాయకులకు పలు పార్టీలు అక్కున చేర్చుకున్నాయి. టిఆర్ఎస్ పార్టీతోపాటు నాటి అధికార కాంగ్రెస్...

తెలంగాణ ఏర్పాటు తరువాత వచ్చిన 2014 ఎన్నికల్లో ఓయూ జేఏసి నాయకులకు పలు పార్టీలు అక్కున చేర్చుకున్నాయి. టిఆర్ఎస్ పార్టీతోపాటు నాటి అధికార కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించి ప్రాధాన్యత కల్పించారు. టిఆర్ఎస్ పార్టీ సుమన్, పిడమర్తి రవికి టికెట్లు ఇస్తే కాంగ్రెస్ మానవతరాయ్, అద్దంకి దయాకర్‌కు టిక్కెట్లు కేటాయించింది. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 10 మంది విద్యార్థి నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చింది. ఎన్నికల తరువాత ఓయూ విద్యార్థి నేతల్లో మేజార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. చాలా అంశాల్లో ప్రభుత్వ విధానాలతో విభేదించి కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో చాలా మంది ఓయూ జేఏసి నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓయూ విద్యార్థలకు టిక్కెట్లల్లో ప్రాధాన్యత కల్పిస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ నేరుగా చాల సభల్లో బహిరంగంగానే ప్రకటించారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చింది . టిక్కెట్లు ఆశించి పార్టీలో చేరిన ఓయూ నేతలు పార్టీపై గంపెడాశలు పెట్టుకున్నారు. స్టేషన్ ఘన్ పూర్ -మానవతరాయ్, క్రిషాంక్ -కంటోన్మెంట్, బాలలక్ష్మి- జనగామ, రాజరామ్ యాదవ్- బాల్కొండ, కుర్వ విజయ్- చేవెళ్ల, మెడిపల్లి సత్యం- చొప్పదండి, దర్వు ఎల్లన్న- ధర్మపురి నియోజికవర్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓయూ నేతల అంచనాలు తారుమారు అయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీన్ మారింది. కూటమి పేరుతో కాంగ్రెస్ ముఖ్యనేతలకే టిక్కెట్టు రావడం గగనమైయింది. దీంతో ఓయూ విద్యార్ది నేతలకు టిక్కెట్టు వస్తాయో రావో అనే అనుమానాలు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. గంపెడాశలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన వీళ్లు... పార్టీ ముఖ్యనేతల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎక్కడా హామి లభించకపోవడంతో నిరాశతో ఉన్నారు.ఓయూ విద్యార్థి నేతలకు గతంలో అనేక పదవులు ఇచ్చిన టిఆర్‌ఎస్...అదే తమ అస్త్రంగా మార్చుకోనుంది. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసేందుకు సమాయత్తం అవుతోంది. అలాంటి వ్యతిరేక ప్రచారం రాకుండా కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలు ఏమి చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories