ఆస్కార్ అవార్డుల సంబరాలు ప్రారంభం.. విజేతలు వీరే!

ఆస్కార్ అవార్డుల సంబరాలు ప్రారంభం.. విజేతలు వీరే!
x
Highlights

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో 90వ అకాడమీ అవార్డ్స్ వేడుక కన్నుల పండుగగా జరిగింది. యావత్‌ సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్స్‌ని...

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో 90వ అకాడమీ అవార్డ్స్ వేడుక కన్నుల పండుగగా జరిగింది. యావత్‌ సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్స్‌ని వివిధ కేటగిరీల్లో అనౌన్స్‌ చేశారు. ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల్లో అత్యధికంగా 13 విభాగాల్లో పోటీలో నిలిచిన ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడు కేటగిరిలోనూ ది షేప్‌ ఆఫ్ వాటర్‌ సినిమా డైరెక్టర్‌
గల్లీర్మో డెల్‌ టోరో ఆస్కార్‌ అందుకున్నారు.

ఉత్తమ నటుడుగా డార్కెస్ట్‌ అవర్‌ సినిమాకి గ్యారీ ఓల్డ్‌మెన్‌, ఉత్తమ నటి విభాగంలో త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరి సినిమాకి ఫ్రాన్సిస్‌ మెక్‌ డోర్మండ్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
స్పాట్.. డార్కెస్ట్‌ అవర్‌ మూవీ సీన్‌, త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌‌ సైడ్‌ ఎబ్బింగ్‌ మిస్సోరి సీన్స్‌

ఆస్కార్‌ రేసులో ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆలిసన్‌ జెన్నీ ఐ, టోన్యా సినిమాకి గోల్డెన్‌ అవార్డ్‌ అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో శ్యామ్‌ రాక్‌వెల్‌ త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌‌ సైడ్‌ ఎబ్బింగ్ మిస్సోరి సినిమాకి అవార్డ్‌ సొంతం చేసుకున్నారు.

90వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో... ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ కేటగిరిలో ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌కి అవార్డ్‌ లభించింది. ఇదిలా ఉంటే... ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌‌గా ఫాంటమ్‌ థ్రెడ్ సినిమా,
ఉత్తమ మేకప్‌, హెయిర్‌ స్టైలింగ్ కేటగిరిలో ఐక్రస్‌ సినిమాలకి అవార్డులు లభించాయి.

బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌: సామ్‌ రాక్‌వేల్‌ ( త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి)
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ ఆర్టిస్ట్‌ : కజుహిరో సుజి, డేవిడ్‌ మాలినోవిస్కి, లూసీ సిబ్బిక్‌ (డార్కెస్ట్‌ హవర్‌)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌: మార్క్‌ బ్రిడ్జెస్‌ (ఫాంతమ్‌ థ్రెడ్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌: బ్రియాన్‌ ఫోజెల్‌, డాన్‌ కోగన్‌ (ఇకారస్‌)
బెస్ట్‌ ఫిలీం ఎడిటింగ్‌: లీ స్మిత్‌ (డంకిర్క్‌)
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌: అలెక్స్‌ గిబ్సన్‌, రిచర్డ్‌ కింగ్‌ (డంకిర్క్‌)
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌: మార్క్‌ వీంగార్టెన్‌, గ్రెగ్‌ లాండకెర్‌, గ్యారీ ఏ రిజ్జో
బెస్ట్‌ ప్రోడక్షన్‌ డిజైన్‌: జెఫ్రీ ఏ మెల్విన్‌, షేన్‌ వీవు (ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌)
బెస్ట్‌ ఫారెన్‌ లాగ్వెంజ్‌ ఫిలిం ( ఉత్తమ విదేశీ చిత్రం): ఏ ఫెంటాస్టిక్‌ వుమన్‌ (చిలీ)
ఉత్తమ సహాయనటి: అలిసన్‌ జేనీ (ఐ, టోన్యా)
యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: డియర్‌ బాస్కెట్‌ బాల్‌ చిత్రానికి గాను గ్లెన్‌ కెనీ, కోబ్‌ బ్రయాంట్‌ అందుకున్నారు
యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలిం: కోకో చిత్రానికిగాను లీ ఉంక్రిచ్‌, డార్లా కే అండర్సన్‌ అందుకున్నారు
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: బ్లేడ్‌ రన్నర్‌ చిత్రానికిగాను జాన్‌ నెల్సన్‌, పాల్‌ లాంబర్ట్‌, రిచర్డ్‌ ఆర్‌ హువర్‌, గెర్డ్‌ నెఫ్జర్‌ అందుకున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories