పది రూపాయలకే చీర...తరలివచ్చిన మహిళాలోకం

పది రూపాయలకే చీర...తరలివచ్చిన మహిళాలోకం
x
Highlights

ఆషాఢం ఆఫర్ అంటే ఏదో అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు బంపర్ ఆఫర్ అల్టిమేట్ ఆఫర్. ఎక్కడా వినని ఆఫర్‌ ప్రకటించింది ఓ షాపింగ్ మాల్. మహిళలనే టార్గెట్ చేస్తూ చీరలను...

ఆషాఢం ఆఫర్ అంటే ఏదో అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు బంపర్ ఆఫర్ అల్టిమేట్ ఆఫర్. ఎక్కడా వినని ఆఫర్‌ ప్రకటించింది ఓ షాపింగ్ మాల్. మహిళలనే టార్గెట్ చేస్తూ చీరలను అతితక్కువ ధరకు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. హన్మకొండలోని ఓ షాపింగ్‌మాల్‌ ఏకంగా పది రూపాయలకే చీర అని ప్రకటన ఇచ్చింది. అంతే ఆడాళ్లంతా ఆ షాపింగ్ మాల్ ముందు క్యూ కట్టారు.

ఏదైనా వస్తువు పది రూపాయలు తక్కువకు దొరికితే ఎంత దూరమైనా వెళ్లే రకాలు మనోళ్లు. అలాంటిది వందల రూపాయల విలువకల చీర కేవలం పది రూపాయలకే వస్తుండటంతో ఊళ్లకు ఊళ్లు దాటి పట్నం బాట పట్టారు. హన్మకొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళాలోకం ఎగబడింది. ఏకంగా వెయ్యి మందికి పైగా మహిళలు తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా తరలిరావాల్సి వచ్చింది.

ఉదయం పది నుంచి 12 గంటల మధ్య ఆఫర్ చీరలు అమ్మకానికి పెట్టినట్లు మాల్ ఓనర్ తెలిపారు. మొదట చీరలను ఫ్రీగా ఇద్దామని అనుకున్నామని అయితే ఆఫర్ ప్రకటించాలనే ఉద్దేశ్యంతోటే పది రూపాయల ధర నిర్ణయించినట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్స్‌ వచ్చినప్పుడు ఇతర ఐటమ్స్ కూడా కొనే అవకాశం ఉందని అలాగే తమ షాపింగ్ మాల్‌ గురించి అందరికీ తెలుస్తుందని యజమాని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories