అక్కకోసం ట్వీట్ చేసిన తమ్ముళ్లు

nanireddy
Updated on: 24 Dec 2018 4:04 PM IST
అక్కకోసం ట్వీట్ చేసిన తమ్ముళ్లు
X

తెలంగాణ ఎన్నికల సందర్బంగా కూకట్ పల్లి బరిలో నిలిచిన నందమూరి సుహాసిని.. తన ఇద్దరు తమ్ముళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిన్న తమ్ముడు ఎన్టీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆమె పబ్లిక్ సర్వీసులో తన మొట్టమొదటి దశను తీసుకుంటుంది. 'ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు సర్గీయ తారకరామారావుగారు తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరుపున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసినదే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలి అని నమ్మే కుటుంబం మాది. ఇదే స్పూర్తితో ప్రజాసేవకు సిద్దపడుతోన్న మా సోదరి సుహాసిని గారికి విజయం వారించాలని ఆకాంక్షిస్తూ.. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ .. మీ నందమూరి కళ్యాణ్ రామ్, తారకరామారావు' అని పేర్కొంటూ ఇద్దరు అన్నదమ్ములు ట్వీట్ చేశారు.

nanireddy

nanireddy

Next Story