‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టైటిల్ సాంగ్ రిలీజ్

nanireddy
Updated on: 24 Dec 2018 4:22 PM IST
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టైటిల్ సాంగ్ రిలీజ్
X

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. నటరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఘన కీర్తిసాంధ్ర.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా లిరిక్స్‌ను రూపొందించారు. 3 నిమిషాలు 30 నిమిషాల పాటు సాగిన ఈ పాట ఎన్టీఆర్ చిత్రాలను, గుణగణాలను కళ్లకు కట్టినట్టు వర్ణించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. కాగా ఇందులో నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, ఇతర పాత్రల్లో విద్యాబాలన్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ నుంచి టైటిల్ సాంగ్‌ను నేడు(ఆదివారం) చిత్రబృందం విడుదల చేసింది.

nanireddy

nanireddy

Next Story