‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు

‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు
x
Highlights

తెలుగు తెరకి రెండు కన్నులు, అభినయానికి మూల ఆత్మలు, వెండితెర యొక్క బంగారు వెలుగులు, ‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు. శ్రీ.కో. ‘ఎన్టీఆర్’ బయోపిక్...

తెలుగు తెరకి రెండు కన్నులు,

అభినయానికి మూల ఆత్మలు,

వెండితెర యొక్క బంగారు వెలుగులు,

‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు. శ్రీ.కో.


‘ఎన్టీఆర్’ బయోపిక్ నుండి మరో ఆసక్తికరమైన పోస్టర్ బయటికి విడుదల అయ్యింది, అది నందమూరి, ఏఎన్నార్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని అందించింది. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహా చిత్ర కావ్యం NTR. మన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు చేసిన ఎన్నోగొప్ప పాత్రలతో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. వెండితెర రెండు కళ్లల వారు ఎదిగారు. ఇద్దరూ కలిసి 14పైగా చిత్రాల్లో కలిసి సినిమాలు చేసుకున్నారు. అ ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీలో ఏఎన్నార్‌ పాత్ర కూడా చాలా చాల ముక్యమైన పాత్ర. అందుకే ఈ పాత్రపై ప్రేక్షకులు అమితాసక్తి చూపిస్తున్నారు. తాజాగా సెప్టెంబ‌ర్ 20న ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా ఏఎన్నార్ లుక్‌ని విడుదల చేశారు. తాత ఏఎన్నార్ గెటప్‌లో సుమంత్ అలా ఒదిగి పోయాడు అనిపిస్తుంది. ఇక ‘దిగ్గజ సోదరులు మళ్లీ వస్తున్నారు’ అంటూ మరో ఆసక్తికరపోస్టర్‌ను విడులచేశారు. ఈ పోస్టర్‌లో ‘ఎన్టీఆర్‌ నోటిలో పెట్టుకున్న సిగరెట్‌ను ఏయన్నార్‌ వెలిగిస్తుంటే’ అటు ఎన్టీఆర్, ఇటు ఏఎన్నార్ అభిమానులకు పండుగలా కనిపిస్తుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య, ఏఎన్నార్ పాత్రలో సుమంత్‌లు నటిస్తున్నారు అని అందరికి తెలిసిందే. శ్రీ.కో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories