జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ ...
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్వల్ప మార్పులు చేసింది. జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను జనవరి 8 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటన చేసింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. కాగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను రెండు గంటల ముందే అనుమతిస్తారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అలాగే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని ఇందుకోసం [email protected]@nic.in ఈ మెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇదిలావుంటే ఈ పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా 273 పట్టణాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది ఎన్‌టీఏ.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT