సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ ఉంటే చాలు: కవిత

సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ ఉంటే చాలు: కవిత
x
Highlights

జగిత్యాలను జిల్లాగా చూడాలనే ప్రజల 40 ఏళ్ల కలను కేసీఆర్ నెరవేర్చారని ఎంపీ కవిత అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పుడొచ్చి ఆగం పట్టియ్యాలని చూస్తున్నాయని...

జగిత్యాలను జిల్లాగా చూడాలనే ప్రజల 40 ఏళ్ల కలను కేసీఆర్ నెరవేర్చారని ఎంపీ కవిత అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పుడొచ్చి ఆగం పట్టియ్యాలని చూస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్, కవిత సమక్షంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన గౌడ సంఘం నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎంపీ కవిత జీవన్ రెడ్డిపై విమర్శల వర్షం గుప్పించారు. జీవన్ రెడ్డి చేయని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగిందన్నారు. జీవన్ రెడ్డి అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలంటూ గెలిచిన జీవన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో సీనియారిటీ అవసరం లేదని, సిన్సియారిటీ ఉంటే చాలన్నారు కవిత.

Show Full Article
Print Article
Next Story
More Stories